మొన్నటితరంలో అంజలీదేవి, షావుకారు జానకి వంటి వారు పెళ్లయిన తర్వాత స్టార్స్‌తో నటించారు. వీరిలో కొందరు పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాతే స్టార్‌డమ్ తెచ్చుకున్నారు. ఇక నిన్నటితరంలో కూడా శ్రీదేవి ఎన్టీఆర్‌కి మనవరాలిగా చేసి ఎన్టీఆర్‌తోనే జత కట్టి బాలకృష్ణ మినహా మిగిలిన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ల సరసన కూడా హీరోయిన్‌గా నటించింది. ముఖ్యంగా తండ్రి అక్కినేని నాగేశ్వరరావుతో పాటు కుమారుడు నాగార్జున సరసన కూడా నటించింది. విజయశాంతి కూడా స్టార్స్, సీనియర్స్‌తో నటిస్తూనే నాడు యంగ్ హీరోలుగా ఉన్న సుమన్, రాజశేఖర్ వంటి వారితో కలిసి యాక్ట్ చేసింది. నేడు కూడా నయనతార, అనుష్క వంటి వారు అదే ఫీట్ చేస్తున్నారు.
ముఖ్యంగా తమిళంలో నయనతార ఉదయనిధి స్టాలిన్ నుంచి శివకార్తికేయన్, విజయ్‌సేతుపతి వంటి యంగ్‌స్టార్స్‌తో సీనియర్ స్టార్స్‌తో కలసి నటిస్తోంది. కొత్తకొత్తగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్న వారితో కూడా నయనతార జోడీ కట్టేందుకు సందేహించడం లేదు. మరోవైపు బాలీవుడ్‌లో పెళ్లై పిల్లలు ఉన్న ఐశ్వర్యారాయ్ నుంచి కాజోల్, వయసుమీద పడిన కత్రినా కైఫ్ వంటి వారు కూడా యంగ్ హీరోల సరసన నటిస్తున్నారు. దాదాపు ఏ 45 ఏళ్ల వయసులో ఐశ్వర్యారాయ్ మరలా రీఎంట్రీ ఇవ్వడమే కాదు.. ఈ వయసులో కూడా ఆమె తన కంటే ఎంతో చిన్నవయసు హీరోలతో కలిసి నటించడానికి రెడీ అంటూ శృంగార సన్నివేశాలలో కూడా నటిస్తోంది. దీనికి 'యే దిల్ హై ముష్కిల్' చిత్రం ఓ ఉదాహరణ. ఇలాంటి కోవలోకే సౌత్ హీరోయిన్ అమలాపాల్, త్రిష, శ్రియ వంటి వారు కూడా వస్తారు.
ఇక నాడు 'ఖుషీ'లో నటించిన భూమిక అందమైన పెదాలు మోము, నడుం చూసి ఆకర్షించబడని ప్రేక్షకుడే లేడు. 'ఖుషీ'లో పవన్‌తో ఆమె నడుం మీద వచ్చే సన్నివేశాలు తలుచుకుంటే మన మనసులో తెలియని అనుభూతి కలుగుతుంది. ఇక 'ఒక్కడు'తో పాటు భూమిక నేటి సీనియర్‌స్టార్స్ నుంచి యంగ్ స్టార్స్ వరకు దాదాపు అందరితో జతకట్టింది. ఇక ఆమె ఆ తర్వాత యోగాగురు భరత్‌ఠాకూర్‌ని వివాహం చేసుకుని, ఓ సినీ మేగజైన్‌ని తెలుగులో స్టార్ట్ చేయడమే కాదు.. 'తకిట తకిట' అనే చిత్రాన్ని కూడా నిర్మించి ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంది. ఇక అల్లరోడు నటించిన 'లడ్డూబాబు'లో కీలక పాత్రను పోషించి, తాజాగా 'ఎంసీఏ' చిత్రంలో నేచురల్ స్టార్‌కి వదినగా నటించింది.
మరి మీరు నటించిన సీనియర్ స్టార్స్ కూడా ఇప్పటికీ హీరోలుగా నటిస్తుంటే మీరు మాత్రం ఇలా అక్కా, వదిన పాత్రలు వేయడం ఏమి అనిపించడం లేదా? అన్న ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ, నేను ఫీల్ కావడం లేదని చెబితే అది అబద్దమే అవుతుంది. బాలీవుడ్‌లో 43 ఏళ్ల ఐశ్వర్యారాయ్ తనకంటే ఎంతోవయసులో చిన్న హీరోతో నటించింది. మన దర్శకనిర్మాతలు ఇలాంటి కథలపై దృష్టి పెట్టి వారు తలుచుకుంటే కానీ మనకు కూడా అలాంటి చిత్రాలు రావని చెప్పుకొచ్చింది.