Advertisement
Google Ads BL

మంచు విష్ణు మనసులో వుంది కాబట్టే..!


ఏ విషయానికి ఆ విషయమే చెప్పుకోవాలి. మంచు మోహన్‌బాబు తన ఇద్దరు భార్యల పిల్లలని సమానంగా చూస్తాడు. మంచు విష్ణు, మంచు మనోజ్‌లకి ఎంత స్వేచ్చ, తన వారసత్వం ఇచ్చాడో మంచులక్ష్మికి కూడా అంతే స్వేచ్చ, తాను ఎంచుకున్న రంగంలో ఎదిగే అవకాశాలను ఇచ్చాడు. ఇక మంచులక్ష్మికి సరోగసీ ద్వారా పాప పుట్టిందని ఓపెన్‌గా చెప్పి తన రూటే సపరేటు అని నిరూపించుకున్నాడు. ఇక ఇప్పటికే ఆ ఇంట మంచు విష్ణు, విరోనికారెడ్డి ఇద్దరు కూతుర్లు అరియానా, వివియానాలతో పాటు మంచు లక్ష్మి కూతురు నిర్వాణతో ఆ ఇల్లు ముచ్చటగా ముగ్గురు ఆడపిల్లలతో కళకళలాడుతోంది. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా విరోనిక రెడ్డి మరో సారి గర్భవతి కావడం, దాంతో మంచు ఫ్యామిలీ అభిమానులు, మంచు విష్ణు ఫ్యాన్స్‌ కూడా మంచు ఫ్యామిలీకి మరో వారసుడు కావాలని, బుల్లి మోహన్‌బాబు పుట్టాలని విషెష్‌ తెలిపారు. దీనిపై మంచు విష్ణు చాలా బాగా రియాక్ట్‌ అయ్యాడు. తనకు మగపిల్లాడు పుడితేనే వారసుడు అవుతాడని ఎలా భావిస్తున్నారు? మరోసారి ఆడపిల్ల పుట్టినా కూడా తనకు ముగ్గురు వారసులు అవుతారు. అంతేగానీ మగపిల్లలే వారసులని, ఆడపిల్లలు వారసులు కాదనే మాట తప్పని చెప్పి స్ట్రాంగ్‌గానే చెప్పాడు. ఎట్టకేలకు మంచు విష్ణు-విరోనిక రెడ్డిలకు సరికొత్త ఏడాది.. స్వాగతం పలుకుతూ, నిజమైన నూతన ఏడాది కానుకగా ఆయనకు మగ పిల్లాడిని ప్రసాదించింది. 

తాజాగా జనవరి 1న విరోనిక హైదరాబాద్‌లోని రెయిన్‌బో హాస్పిటల్‌లో మగ పిల్లాడికి జన్మనిచ్చింది. అయితే ఒకప్పుడు మన ప్రభుత్వం కుటుంబ నియంత్రణను ప్రచారం చేస్తూ ఒకరైతే ముద్దు.. ఇద్దరైతే హద్దు.. ఆపై ఇక వద్దు అని ప్రచారం చేసింది. కానీ తాజాగా మాత్రం ఇద్దరు చాలనే ప్రచారమే చేస్తోంది. చట్టసభలలో కూడా ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ ఉన్నవారికి అవకాశం లేకుండా చట్టం తెచ్చింది. మరి మొదటి కాన్పులోనే హాయిగా తమకు పుట్టిన ఇద్దరమ్మాయిలతో సరిపెట్టుకోకుండా మరోసారి మూడో బిడ్డకు జన్మనిచ్చారంటే వారి మనసులో కూడా మగపిల్లాడు కావాలనే కోరిక ఉండే ఉంటుందని అంటున్నారు కొందరు.

Manchu Vishnu Blessed with a Son:

Manchu Vishnu Becomes a Father Again
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs