Advertisement
Google Ads BL

టాలీవుడ్ తో నయన్ ఆడుకుంటోంది..!!


నయనతార వయసు మీద పడుతున్న సినిమా ఆఫర్స్ ఏమి తగ్గట్లేదు. సరే వచ్చిన సినిమాలు సరిగా చేయాలికదా.. అవి కూడా సరిగా చెయ్యట్లేదు. ఆమెను సినిమాలో సెలెక్ట్ చేయటం ఎంత కష్టమో.. ఆమెతో సినిమా ఫినిష్ చేయడం కూడా అంతే కష్టంగా మారింది.

Advertisement
CJ Advs

ప్రస్తుతం ఈమె తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది. ఒకటి బాలయ్య తో 'జై సింహా'. ఇది పూర్తయిపోయి రిలీజ్ కి కూడా రెడీ అయింది. ఇంకోటి చిరంజీవి 'సైరా' సినిమా. ఈమె ఇందులో లీడ్ రోల్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో నయన్ వుంటుందా? వుండదా? అన్నదాని మీదే గాసిప్ లు వినిపిస్తున్నాయి. రెండో షెడ్యూల్ దాదాపు ఈమె మీద ఉంటుందట. కానీ ఇంతవరకు డేట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందని టాక్.

'బాబు బంగారం' ఫినిషింగ్  టైమ్ లో దర్శకుడు మారుతి అండ్ చిత్ర బృందం కిందా మీదా పడినా.... నయనతారను హైదరాబాద్ కు రప్పించలేకపోయారు. చేసేది ఏమి లేక మారుతీ చెన్నై వెళ్లి ఆమెతో సాంగ్ షూట్ చేద్దాం అనుకున్నాడు.... కానీ నయనతార ససేమిరా అనేసింది. ఆఖరికి ఆ పాట లేకుండానే 'బాబు బంగారం' విడుదలయింది.

లేటెస్ట్ గా 'జై సింహా' విషయంలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగిందని తెలుస్తోంది. సినిమా ఫినిష్ అయ్యాక చిత్ర బృందం నయనతారతో రెండు ఇంటర్వ్యూస్ ప్లాన్ చేశారు. అందుకు ఓకె కూడా చెప్పింది నయన్. కానీ చివరిలో హ్యాండ్ ఇచ్చి చెన్నై వెళ్లిపోయిందని తెలుస్తోంది. దాంతో చిత్ర బృందం అవాక్కయ్యిందట. 'జై సింహా' పరిస్థితే ఇలా ఉంటే... మరి సైరా వ్యవహారం ఎలా సెట్ అవుతుందో? చూడాలి. సైరా యూనిట్ అయితే నయనతారతో సమస్యలేవీ లేనట్లే అంటోంది. ఇది ఎంతవరకు నిజమో చూడాలి.

Jai Simha Team Shocked with Nayanthara Decision:

Nayanthara Plays with Tollywood on Movie Promotions
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs