రాజకీయాలలో ఆవేశం పనికిరాదు. సహనం, నేర్పరితనం, రాజనీతి వంటివి ఎన్నో ఉండాలి. కానీ ప్రకాష్‌రాజ్ ఆవేశపరుడు. పైగా ఆయనకు క్రమశిక్షణ కూడా లేదంటారు. ఈయన ఈమద్య బెంగుళూరులో తాను పనిచేసిన పత్రికకు చెందిన జర్నలిస్ట్ గౌరీలంకేష్ హత్య తర్వాత రాజకీయాల గురించి తరుచుగా మాట్లాడుతున్నాడు. గౌరీలంకేష్ హత్య విషయంలో కేంద్రప్రభుత్వం, మోదీ ఉదాసీనత చూపిస్తున్నారని ఆయన మండిపడ్డాడు. ఇక గుజరాత్ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ, మీకు ఈ విజయం ఆనందాన్నిస్తోందా? అని కాస్త వ్యంగ్యంగా స్పందించాడు. దానికి కారణం మోదీ బృందం గుజరాత్‌తో తమకు 150 దాకా సీట్లు వస్తాయని వాదించి,దాని కంటే చాలా తక్కువ సీట్లు మాత్రమే గెలుచుకోవడం. ఇక తన సన్నిహితులతో మోదీ 150 సీట్లు గెలుస్తామని గుజరాత్‌లో చెప్పారు. అందులో జీఎస్టీ కింద 28శాతం సీట్లు తగ్గించి మోదీకి గుజరాత్ ప్రజలు తమ ఉద్దేశ్యం చాటిచెప్పారని ప్రకాష్‌రాజ్ వ్యాఖ్యానించాడు.
ఇక త్వరలో కర్ణాటకలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే హీరో ఉపేంద్ర పార్టీని కూడా ప్రకటించాడు. బిజెపి, కాంగ్రెస్‌లు యుద్దానికి రంగం సిద్దం చేసుకుంటున్నాయి. ఇక తాజాగా ఆయనకు ప్రెస్‌క్లబ్ ఆఫ్ బెంగుళూరు సంస్థ 2017కి గాను ఉత్తమ వ్యక్తి అవార్డుని ఇచ్చింది. ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. తనకు రాజకీయాలలోకి రావడం ఇష్టంలేదని, అవి చాలా కష్టమైన పని అంటూనే తనను తరచుగా రెచ్చగొడితే మాత్రం రాజకీయాలలోకి వస్తానని బెదిరింపు ధోరణిలో అన్నాడు.
బెంగుళూరును బెందకాళూర్ అని పిలుస్తారని, శాంతికి విఘాతం కలిగించి అశాంతిని సృష్టించేవారి ఆటలు ఇక్కడ సాగవని చెప్పారు. ఇక ఈయన మోదీని విమర్శిస్తున్న ప్రతిసారి తెలుగు నిర్మాత, దర్శకుడు మధురశ్రీదర్‌రెడ్డి ఆయనకు కౌంటర్లిస్తూ, మోదీపై ఈగ వాలనివ్వని సంగతి తెలిసిందే. అయితే రెచ్చగొడితే రాజకీయాలలోకి వస్తానని ఏకంగా బెదిరించే వ్యక్తిని చూడటం మాత్రం ఇదే. ఇలాంటి వారు రాజకీయాలలోకి ఏమాత్రం పనికిరారని చెప్పవచ్చు. స్వయం క్రమశిక్షణ లేని వ్యక్తులు ప్రజలనెలా క్రమశిక్షణగా నడిపిస్తారు? అనే ప్రశ్న ఉదయించకమానదు.