తెలుగు జీనియస్ క్రియేటివ్ డైరెక్టర్స్‌లో వంశీ గురించి కూడా చెప్పుకోవాలి. ఇక ఈయనది ముక్కుసూటి మనస్తత్వం. ఆయన మోహన్‌బాబుతో 'డిటెక్టివ్ నారద' చిత్రం చేశారు. మోహన్‌బాబుది కూడా ముక్కుసూటి మనస్తత్వమే. దాని గురించి వంశీ మాట్లాడుతూ, మోహన్‌బాబు గారి వల్ల నాకేమీ ఇబ్బందులు ఎదురుకాలేదు. నేను చెప్పినట్లే ఆయన చేశారు. ఆయన ఏ విధంగానూ నన్ను ఇబ్బంది పెట్టలేదు. ఆ సినిమా సమయంలో, తర్వాత కూడా మనమిద్దరం చేద్దామని అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కానీ ఈ ఫీల్డ్‌లో సక్సెసే మాట్లాడుతుంది. 'డిటెక్టివ్ నారద' ఫ్లాప్ అయింది. దాంతో ఆయన నాతో మరో చిత్రం చేయలేదేమో.
'డిటెక్టివ్ నారద' తర్వాత కూడా చాలా సార్లు మేము కలుసుకున్నాం. ఆయన నన్నెంతో మర్యాదగా చూశారు. ఇక నేను స్వాతి వీక్లీకి 'గాలి కొండాపురం రైల్వేగేట్'అనే నవల రాశాను. దానిని స్వాతి వీక్లీలో సీరియల్‌గా ప్రచురించారు. ఆ కథను స్క్రిప్ట్ చేసుకుని వెంకటేష్‌తో తీయాలని భావించాను. వెంకటేష్ అప్పుడే హీరోగా ఎదుగుతున్నాడు. నా స్టోరీలో కాస్త హీరోయిన్‌కి ప్రాధాన్యం ఉంది. ఆ కథ రామానాయుడు గారికి నచ్చలేదు. ఆయన అనుకున్న విధంగా చేయడం నాకు చేతకాలేదు. అందుకని ఆ చిత్రం ఆగిపోయింది.. అని చెప్పుకొచ్చాడు.