Advertisement
Google Ads BL

అలా చేయాల్సి వస్తే సినిమాలు మానేస్తా: హీరోయిన్!


'అఆ, ప్రేమమ్, ఉన్నది ఒకటే జిందగీ, శతమానం భవతి' సినిమాలతో హిట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్... ప్రస్తుతం నాని సరసన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'కృష్ణార్జున యుద్ధం' సినిమాలో నటిస్తుంది. అనుపమ మలయాళ హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టినప్పటి నుండి చాలా పద్దతి గల అమ్మాయిగానే కనబడుతుంది. అయితే ఒక పెద్ద ప్రాజెక్ట్ లో కాస్త గ్లామర్ రోల్ చెయ్యమన్నందుకు అనుపమ ఆ ప్రాజెక్ట్ నే వదులుకుందనే న్యూస్ హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అదే విషయమై అనుపమ పరమేశ్వరన్ ఒక పత్రిక ఇంటర్వ్యూలో స్పందించింది.

Advertisement
CJ Advs

ఆ పెద్ద బ్యానర్ ని రిజెక్ట్ చెయ్యడం నిజమేనని చెప్పింది. ఆ బ్యానర్ లో సినిమా చేస్తే తన లైఫ్ మంచి టర్న్ తిరుగుతుందని వారు చెప్పినా.... వారి పెట్టిన కండిషన్ వలనే ఆ సినిమా వదులుకోవాల్సి వచ్చిందని చెబుతుంది. అనుపమని ఆ బ్యానర్ లో మాములుగా కన్నా కాస్త ఎక్కువగా గ్లామర్ గా కనిపించమని వారు కోరగా అనుపమ మాత్రం అలా గ్లామర్ గా కనబడడం తన వల్ల కాదని.. తానో మధ్యతరగతి  అమ్మాయినని... కుటుంబం మొత్తం కలిసి సినిమా చూసినప్పుడు తన గ్లామర్ వలన వారెవరు ఇబ్బంది పడకుండా ఉండే సినిమాలే చేస్తానని.. కేవలం గ్లామర్ వలనే కాకుండా.. మరొక పెద్ద ప్రాజెక్ట్ లో తన పాత్ర చివరికి చనిపోతున్నందువల్ల ఆ సినిమాని వదులుకున్నానని చెబుతుంది. ఆ సినిమాలో నా పాత్ర చంపేయడం నాకు నచ్చక.. క్లైమాక్స్ మారిస్తే సినిమా చేస్తానన్నా.. కానీ దర్శక నిర్మాతలు కుదరదన్నారు.. అందుకే ఆ సినిమాని వదిలేసానని చెబుతుంది అనుపమ.

మరి అస్సలు గ్లామర్ గా కనబడకుండా సినిమాల్లో ఛాన్స్ లు రావాలనుంటే కష్టం కదా అని అనుపమని అడుగగా.. గ్లామర్ అంటే  చిన్న చిన్న బట్టలేసుకుంటే కాదు.. ఫుల్ డ్రెస్ వేసుకున్నా గ్లామర్ గా కనబడొచ్చు. కేవలం గ్లామర్ ఉంటేనే అవకాశాలొస్తాయంటే అలాంటి అవకాశాలు నాకొద్దు... సినిమాల్లో అవకాశాలు లేకపోతే... అందరి అమ్మాయిల్లా నా చదువుకి తగ్గ ఉద్యోగం చేసుకుని బతికేస్తానంటూ అదిరిపోయే సమాధానము ఇచ్చింది అందాల బొమ్మ అనుపమ పరమేశ్వరన్. 

Again Anupama Parameswaran Clarity on Exposing:

No Exposing say Heroine Anupama Parameswaran
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs