Advertisement
Google Ads BL

కోటి ఇస్తే చేస్తానంటూ..మళ్లీ మెలికపెట్టింది!


చేతిలో సినిమాలు లేకపోయినా భారీగా రెమ్యునరేషన్ కావాలంటున్నారు హీరోయిన్స్. హీరోకైతే  చెల్లుద్ది గాని హీరోయిన్స్ కి మాత్రం అలా రెమ్యునరేషన్ విషయంలో డిమాండ్ చేస్తే మాత్రం.. ఆమెకు క్రేజ్ ఉందా లేదా అని ఆలోచించి ఆమె అడిగింది ఇవ్వాలా లేదా అనేది డిసైడ్ చేస్తారు నిర్మాతలు. అయితే ఇపుడు సీనియర్ హీరోల పక్కన హీరోయిన్స్ కొరత అనేది టాలీవుడ్ ని పట్టి పీడిస్తుంది. అందుకే వారిపక్కన హీరోయిన్స్ గా నటించాలంటే వారి డిమాండ్స్ కొండెక్కి కూర్చుంటున్నాయి. చిరంజీవి కం బ్యాక్ మూవీ లో కాస్త సీనియర్ హీరోయిన్స్ చేసిన డిమాండ్ కి ఏం చెయ్యాలో తెలియక ఆ సినిమా నిర్మాత రామ్ చరణ్... చిరుకి జోడిగా కాజల్ ని తెచ్చి పెట్టాడు.

Advertisement
CJ Advs

ఇక బాలకృష్ణ పక్కన నయనతార, శ్రియ వంటి హీరోయిన్స్ ఉంటే.. అందులో నయనతార డిమాండ్ మాములుగా లేదు. ఇక ఇప్పుడు చిరు పక్కన, బాలయ్య పక్కన  నటిస్తున్న నయనతార ప్రస్తుతం మాంచి ఫామ్ లో ఉంది. అయితే ఇప్పుడు మరో సీనియర్ హీరో వెంకటేష్ పక్కన హీరోయిన్ సెట్ కావడం లేదు. ఏదో కాజల్ అయితే బావుంటుందనుకుంటే కాజల్ కోటి డిమాండ్ చేస్తుంది. చేతిలో ఆఫర్స్ లేకపోయినా కాజల్ మాత్రం కోటికి తగ్గడం లేదు.  అందులోను 'ఆటా నాదే వేటా నాదే' సినిమాలో వెంకటేష్ నడి వయస్కుడు... అంటే ఇద్దరు పిల్లలకు తండ్రిగా నటిస్తున్నాడు.

మరి వెంకీ సరసన ఇద్దరు పిల్లల తల్లిగా నటించాలంటే కాజల్ కి కోటి ఇవ్వక తప్పేలా లేదు. కోటి ఇవ్వడం సమస్య కాదు కానీ, కాజల్ మాత్రం తనకి ఖాళీ ఉన్న డేట్స్ కేటాయిస్తానని మరో మెలిక పెట్టింది. మరి కోటి ఇవ్వడానికి రెడీగా ఉన్న నిర్మాతలకు కాజల్ డేట్స్ ఎప్పుడిస్తుందో తెలియక సతమతమవుతున్నారు. చూద్దాం కాజల్.. వెంకీ సరసన ఫైనలా లేదా అనేది.

Kajal Demands 1 Crore for Aata Naade Veta Naade:

Kajal Agarwal Conditions 1 Crore for Venki Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs