Advertisement
Google Ads BL

స్నేహ సీన్స్ తొలగించేశారంట..!


తెలుగులో సౌందర్య, ఊహ తర్వాత హోమ్లీ పాత్రలు చేసే హీరోయిన్‌గా స్నేహకి మంచి పేరుంది. ఇక ఈమె తెలుగులో బిగ్‌స్టార్‌ సరసన నటించింది. ఇక కెరీర్‌ ఫేడవుట్‌ అవుతున్న సమయంలో కోలీవుడ్‌కి వెళ్లి నటుడు ప్రసన్నని వివాహం చేసుకుంది. ఈయన ఇటీవల మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ హీరోగా బి.వి.ఎస్‌. రవి దర్శకత్వంలో వచ్చిన 'జవాన్‌' చిత్రంలో విలన్‌గా నటించి తెలుగులో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Advertisement
CJ Advs

ఇక ఇటీవలే స్నేహ ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అదే సమయంలో ఆమె మోహన్‌రాజా దర్శకత్వంలో శివకార్తికేయన్‌-నయనతార జంటగా నటించిన 'వెలైక్కారన్‌' చిత్రంలో నటించింది. ఇందులో ఆమె పాత్ర ఎంతో కీలకం అని, దాదాపు అరగంట సేపు ఆమె స్క్రీన్‌పై కనిపిస్తుందని దర్శకనిర్మాతలు చెప్పారు. పాత్ర కూడా నచ్చడంతో పెద్దగా పారితోషికం డిమాండ్‌ చేయకుండానే ఆమె ఈ చిత్రం కోసం ఎంతో కష్టపడి బరువు తగ్గి ఆ పాత్రను చేసింది. ఇది తనకు మంచి పేరుతోపాటు వరుస అవకాశాలను తెచ్చి, రీఎంట్రీకి ఉపయోగపడుతుందని స్నేహ భావించింది.

కానీ తాజాగా ఈ చిత్రాన్ని ఆమె థియేటర్‌లో చూసి కన్నీరు పెట్టుకుందిట. కారణం ఎడిటింగ్‌లో ఆమె సీన్స్‌ అన్నింటికి కత్తెరవేసి కేవలం ఐదారు సీన్లు మాత్రమే ఉంచటంతో ఆమె తీవ్ర మనస్థాపానికి లోనైంది. నేడు ఇలా సీన్స్‌ కత్తెరలో ఎగిరిపోవడం తరచుగా జరుగుతోంది. ఇక స్టార్‌ హీరోలకు తప్ప ఎవ్వరికీ దీనిపై దర్శకనిర్మాతలను నిలదీసే పరిస్థితి లేదు. అయినా ఆమె ఈ విషయాన్ని ధైర్యంగా బయటపెట్టడం మంచిదే. ఎందుకంటే భవిష్యత్తులో ఆమెలాంటి వారు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు.

Actress Sneha Very Disappointed with Velaikkaran:

Sneha Scenes Deleted From Velaikkaran
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs