లేటెస్ట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ నయనతార బాలకృష్ణ తనకు తండ్రి లాంటివాడని చెప్పింది. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపాయి. మూడు సినిమాలు బాలకృష్ణతో కలిసి నటించిన నయనతార ఇలా మాట్లాడి ఉండకూడదు అని కొందరు ఫ్యాన్స్ మండిపడ్డారు.
నిజానికి నయనతార ఉద్దేశ్యం ఏదైనా దాని మీనింగ్ మాత్రం ఇంకోలా కన్వే కావడం ఇబ్బందులుకు దారి తీసింది. వయసు లెక్కలు తీసుకుంటే బాలయ్యకు కూతురి వయసే నయనతారకు ఉంటుంది. అంత మాత్రాన సినిమాల్లో కూడా దాని ప్రాతిపాదికన పాత్రలను డిసైడ్ చేయరు. సినిమా వేరు వ్యక్తిగత జీవితం వేరు.
నిజానికి హీరోస్ అయినా హీరోయిన్స్ అయినా తమ వయసుకు తగ్గట్టు అవతలి వారి హోదా - ఏజ్ - ఇమేజ్ కి తగ్గట్టు రిలేషన్ షిప్ మైంటైన్ చేస్తారు. నయనతార అన్నది కూడా ఆ మీనింగ్ లోనే. బాలయ్య తనకు తండ్రిలా గైడ్ చేస్తూ మార్గదర్శకత్వం చేస్తారని చెప్పే ప్రయత్నం చేసింది. మరి ఇది ఎన్ని అర్దాలకు దారి తీస్తుందో చూడాలి. దీనిపై బాలయ్య ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.