Advertisement
Google Ads BL

వర్మ.. పవన్ ని పొగిడాడా? తిట్టాడా?


వర్మది చంచల మనస్తత్వమని అంటారు. ఆయన ఎప్పుడు ఎలా ? ఏ విషయంపై స్పందిస్తాడో కూడా ఎవ్వరూ ఊహించలేరు. ఈయన చేసే కామెంట్స్‌ వింటే అవి పొగిడాడో? లేదో కూడా అర్ధం కావు అనేది వాస్తవమే. ఆయన ఏదైనా కామెంట్స్‌ చేసినా, మౌనంగా ఉన్నా కూడా అది సంచలనమే అవుతుంది. ఇక తాజాగా పవన్‌పై మరోసారి వర్మ స్పందించాడు. విత్తు ముందా? చెట్టు ముందా? కోడి ముందా? గుడ్డు ముందా? అనే తరహా దానికి తనకు సమాధానం లభించిందని, పవన్‌ ముందుగా పుట్టి తర్వాత ఎమోషన్స్‌ పుట్టాయని పేర్కొన్నాడు. 

Advertisement
CJ Advs

పవన్‌ ముందు పుట్టి మనకి ఎమోషన్స్‌ నేర్పుతున్నాడు. ఇక ఈ జన్మలోనే కాదు.. పోయిన జన్మలో కూడా నేను పవన్‌ వంటి యాటిట్యూడ్‌ ఉన్న వ్యక్తిని చూడలేదు. ఆయన ఎమోషన్స్‌ అద్భుతంగా ఉంటాయి. అమితాబ్‌బచ్చన్‌, రజనీకాంత్‌లు కూడా పవన్‌ ముందు దిగదుడుపే. పవన్‌ని చూస్తే బ్రూస్‌లీ మొగుడిలా అనిపిస్తున్నాడు. ఇక నేను స్వలింగ సంపర్కుడిని కాదని ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ ప్రపంచంలోని అందరు అమ్మాయిలను ఓ వైపు పెట్టి, పవన్‌ని ఓ వైపు పెట్టి, పవన్‌నటిస్తున్న 'అజ్ఞాతవాసి' లుక్‌ని ఓ సారి అక్కడ ఉంచితే నేను అందరు అమ్మాయిలను కాదని పవన్‌నే పెళ్లాడతాను అని కామెంట్స్‌ చేశాడు. 

దీంతో వర్మ అంతరంగం ఏమిటి? ఆయన ఏం చెప్పదలుచుకుని ఈ కామెంట్స్‌ చేశాడు? అనేది ప్రస్తుతం ఆసక్తికర విషయంగా చర్చనీయాంశం అయింది. అదే సమయంలో ఆయన పవన్‌ బుగ్గలపై ముద్డాడుతున్న ఫొటోని మార్ఫింగ్‌ చేసి పెట్టడం కూడా గమనార్హం.

RGV Sensational Comments on Pawan Kalyan:

Again RGV Targets Pawan Kalyan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs