Advertisement
Google Ads BL

అల్లు అర్జున్ ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నాడు?


అల్లు అర్జున్ ప్రస్తుతం వక్కంతం వంశీ డైరెక్షన్ లో 'నా పేరు సూర్య' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ఎవరు అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. అల్లు అర్జున్ నెక్స్ట్ డైరెక్టర్ వీళ్ళే అంటూ రకరకాల పేర్లు వినబడుతున్నాయి. కానీ అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ డైరెక్టర్ గా ఎవరు దాదాపు కన్ఫర్మ్ కాలేదు. కానీ అల్లు అర్జున్ ఒక కొత్త డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చాడని... అతను చెప్పిన స్టోరీ లైన్ కి బాగా ఇంప్రెస్ అయ్యాడనే న్యూస్ వినబడింది.

Advertisement
CJ Advs

ఈ లోపు అల్లు శిరీష్ హీరోగా వచ్చిన ఒక్క క్షణం దర్శకుడు విఐ ఆనంద్ లైన్ లోకి వచ్చాడు. విఐ ఆనంద్ తన టేకింగ్ తో ఒక్క క్షణంలో  ప్రేక్షకులను మెప్పించాడు. అయితే ఆనంద్ ఇదే కథను ఒక పేరున్న హీరోతో తీసుంటే రికార్డులు బ్రేక్ అయ్యేవి అనే కామెంట్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. 'ఎక్కడికి పోతావు చిన్నవాడ' హిట్ వచ్చినా ఈ దర్శకుడుకి ఒక్క స్టార్ హీరో కూడా దొరకలేదు. అందుకే మీడియం బడ్జెట్ తో అల్లు శిరీష్ తో మమ అనిపించాడు.

అయితే ఆనంద్ ని వదులుకోవడం ఇష్టం లేక నిర్మాత అల్లు అరవింద్.. అల్లు అర్జున్ తో ఒక సినిమాకి కమిట్ చేయించడమే కాదు.. పెద్ద మొత్తంలో అడ్వాన్స్ కూడా ముట్టజెప్పాడట. అయితే అల్లు అర్జున్ మాత్రం ఈ విషయంలో ఇంకేం అనుకోలేదు. అలాగే ఆ కొత్త దర్శకుడి విషయంలోనూ అంతే. ఒకవేళ కొత్త దర్శకుడితో మరోమారు అంటే.. ఇప్పటికే ఒక కొత్త దర్శకుడితో సెట్స్ మీదున్న అల్లు అర్జున్ కి మరోసారి డేర్ చేసే పరిస్థితి లేదు. అందుకే అటు వి ఐ ఆనంద్ విషయంలోనూ ఇటు ఆ కొత్త దర్శకుడికి కూడా కమిట్ అవ్వలేక అల్లు అర్జున్ కన్ఫ్యూజ్ అవుతున్నాడనే టాక్ మాత్రం బాగా వినబడుతుంది. మరోపక్క తమిళ దర్శకుడు లింగుస్వామితో ఒక సినిమాకి కమిట్ అయినా కూడా ఆ సినిమా మీద ఎటువంటి స్పష్టత లేదు. చూద్దాం బన్నీ నెక్స్ట్ సినిమా దర్శకుడెవరనేది? 

Allu Arjun in Confuse for His next Movie:

VI Anand, New Director.. Allu Arjun Confused
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs