టాలీవుడ్ లో యువ హీరోల హవా నడుస్తోంది. గత సినిమాలకు ఏ మాత్రం దగ్గరగా ఉండకుండా క్యారెక్టర్ లో కొత్తదనాన్ని చూపించేందుకు వారు ఇష్టపడుతున్నారు. సినిమా రిజల్ట్ ఎలా వున్నా.. నటనతో అందరిని ఆకట్టుకుంటున్నారు. అదే తరహా ప్రయత్నం చేసి మంచి హిట్ అందుకుంటున్న వారిలో శర్వానంద్ ఒకడు.
సినిమా సినిమాకు ఎంత డిఫెరెంట్ గా కనిపిస్తున్నాడో తెలియంది కాదు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమాను చేయడానికి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో శర్వా ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడట. సెకండ్ హాఫ్ లో ఆర్మీకి సంబంధించిన యుద్ధ సీన్స్ చాలా కొత్తగా ఉంటాయని చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తోంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా 'నా పేరు సూర్య' సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు శర్వా కూడా పర్ఫెక్ట్ ఆర్మీ ఆఫీసర్ ఎలా ఉండాలో తెలుసుకొని అందుకు తగ్గ ఫిట్ నెస్ పై శ్రద్ధ వహిస్తున్నాడట. శర్వాకి జోడిగా సాయి పల్లవి నటిస్తుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది.