Advertisement
Google Ads BL

అనుష్క.. నాగ్ కి ఓకే చెప్పిందంట!!


రామ్ గోపాల్ వర్మ - నాగార్జున కలయికలో ఒక యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ పది రోజులపాటు ఏకధాటిగా జరిగింది. అయితే పది రోజుల రెగ్యులర్ షూటింగ్ తర్వాత నాగార్జున తన కొడుకు అఖిల్ హలో సినిమా విడుదల కోసం గ్యాప్ తీసుకున్నాడు. ఇక అఖిల్ హలో సినిమా విడుదలై థియేటర్స్ లో సందడి చెయ్యడంతో నాగార్జున ప్రస్తుతం వర్మ సినిమా షూటింగ్ మీద కాన్సంట్రేట్ చెయ్యబోతున్నాడు. జనవరి నుండి ముంబై పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ మొదలు కాబోతుంది.

Advertisement
CJ Advs

ఇక ఈ యాక్షన్ సినిమాలో నాగార్జునతో ఒక కొత్త హీరోయిన్ నటిస్తుంది. ఆమె పేరుని కూడా వర్మ ఎప్పుడో రివీల్ చేశాడు. మైరా సరీన్ అనే కొత్తమ్మాయి నాగ్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ముందుగా అనుష్క నటిస్తుందని గాసిప్ వినబడింది. అయితే ఆ న్యూస్ నిజమే అంటున్నారు. అనుష్క... నాగ్ - వర్మ సినిమాలో ఒక అతిధి పాత్ర చెయ్యబోతుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరి ఇప్పటికే నాగార్జున సినిమాల్లో అనుష్క గెస్ట్ రోల్స్ చేసింది. మొన్నటికి మొన్న నాగ్ సోగ్గాడే చిన్నినాయనలో కృష్ణ కుమారిగా అలరించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఆయుర్వేద ట్రీట్మెంట్ లో ఉన్న అనుష్క నాగ్ కోసం వర్మ - నాగ్ కలయికలో వస్తున్న మూవీలో గెస్ట్ రోల్ కి ఒప్పుకుందట. నాగార్జునతో ఉన్న సత్సంబందాలు వలనే అనుష్క ఈ రోల్ చెయ్యడానికి ఒకే అందని కూడా చెబుతున్నారు. అయితే వర్మ - నాగ్ సినిమాలో అనుష్క ఉందా లేదా అనేది వర్మ గాని నాగ్ గాని క్లారిటీ ఇచ్చే వరకు ప్రస్తుతానికి  సస్పెన్స్.

Anushka in Nag and RGV Film:

Anushka Guest Role in Nagarjuna and RGV Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs