Advertisement
Google Ads BL

సునీల్ కామెడీ ఏ సినిమాతో..?


కమెడియన్ గా ఉన్న సునీల్ హీరోగా మారాడు. ఇప్పుడు హీరో కాస్త మళ్ళీ కమెడియన్ గా మారాడానికి రెడీగా వున్నాడు. హీరోగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న సునీల్ కి తాను హీరోగా పనికిరానని  ఫిక్స్ అయ్యాడో లేదంటే... హీరోగా నటిస్తూనే కమెడియన్ గా కూడా చేయడానికి ఫిక్స్ అయ్యాడో క్లారిటీ లేదుగాని ఇప్పుడు వరసబెట్టి స్టార్ హీరోల సినిమాల్లో సైడ్ కేరెక్టర్స్ వెయ్యడానికి అలాగే కామెడీ రోల్స్ చెయ్యడానికి రెడీగా వున్నాడు. అయితే ఏ దర్శకుడు సునీల్ కి కమెడియన్ గా ముందు అవకాశం ఇస్తాడనే విషయం మీద ప్రస్తుతానికి క్లారిటీ లేదు.

Advertisement
CJ Advs

ఎందుకంటే సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో చిరంజీవి నటిస్తున్న ప్రతిష్ట్మాక చిత్రం సై రా సినిమాలో కేరెక్టర్ ఆర్టిస్ట్ గా సునీల్ కన్ఫర్మ్ అయ్యాడు. కానీ అధికారిక ప్రకటన లేదు. అలాగే మరొక సినిమా తన స్నేహితుడు త్రివిక్రమ్ ని నమ్ముకున్నాడు సునీల్. అసలు అజ్ఞాతవాసిలోనే సునీల్ కమెడియన్ గా రీఎంట్రీ ఇప్పించాల్సిన త్రివిక్రమ్.. ఆ సినిమాలో ఛాన్స్ ఇవ్వకపోయినా ఎన్టీఆర్ తో తీసే కుటుంబ కథా చిత్రంలో మాత్రం సునీల్ కి మంచి రోల్ ఇస్తున్నాడని టాక్ ఉంది. 

మరి త్రివిక్రమ్ సినిమా అంటే కామెడీ పంచ్ లకు కొదవుండదు. ఇక స్నేహితుడు సునీల్ లైఫ్ ని మళ్ళీ టర్న్ చెయ్యాలంటే సునీల్ ని గట్టిగానే కమెడియన్ గా రీఎంట్రీ ఇప్పిస్తాడు. అలాగే సునీల్ మరో మూవీ శ్రీను వైట్ల - రవితేజ కలయికలో తెరకెక్కనున్న సినిమాలోనూ కమెడియన్ గా కనబడతాడనే టాక్ వుంది. శ్రీను వైట్ల, రవితేజ సినిమాలో సునీల్ కి ఒక పవర్ ఫుల్ కమెడియన్ పాత్రని సెట్ చేస్తున్నాడట. మరి శ్రీను వైట్ల సినిమాతోనూ కమెడియన్ గా తన టాలెంట్ ని మళ్ళీ ప్రేక్షకులకు చూపించాలని తహ తహలాడుతున్నాడు. చూద్దాం ఈ మూడు సినిమాలలో సునీల్ ఖచ్చితంగా ఏ సినిమాలో కామెడీ పండిస్తాడో అనేది.

Suspense on Sunil Re Entry film :

One More Film to Comedian Sunil in Re Entry
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs