ప్రస్తుతం దేశంలోని యువ రాజకీయనాయకుల్లో అత్యంత చురుకైనా, తెలివైన నాయకుడిగా కేటీఆర్ దూసుకుని వెళ్తున్నాడు. ప్రభుత్వంలో కీలకపాత్రను పోషిస్తూ 'లీడర్ ఆఫ్‌ది ఇయర్'గా, ఇవాంకా టూర్‌ని విజయవంతం చేసిన నాయకునిగా ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇక హైదరాబాద్ నుంచి సినీ పరిశ్రమ ఆంధ్రాకు వస్తుందనే వాదనలకు చెక్ పెట్టి అక్కడే ఇండస్ట్రీ ఉండేలా.. సినిమా వారితో కూడా మంచి టచెస్ మెయిన్‌టెయిన్ చేస్తున్నాడు. ఇక ఈయన సోషల్‌మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడు. ట్విట్టర్ ద్వారా తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించడంతో పాటు అందరినీ ఫాలో అవుతూ, ప్రజలతో సోషల్‌మీడియాలో మమేకం అవుతున్నాడు.
తాజాగా ఆయన ట్విట్టర్ వేదికగా ప్రజలతో మాట్లాడి వారి ప్రశ్నలకు బదులిచ్చాడు. పనిలో పనిగా మన సినీ అభిమానులు ఆయన్ను తమ హీరోల గురించి చెప్పమని అడగటంతో ఆయన స్పాంటేనియస్‌గా, ఎంతో సునిశిత పరిశీలనతో సమాధానం ఇవ్వడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మహేష్‌బాబు 'స్క్రీన్ ప్రెజెన్స్‌లో సూపర్‌స్టార్', ప్రభాస్ 'బాహుబలి', ఎన్టీఆర్ 'పర్ఫార్మర్' అని చెప్పాడు. ఓ పవన్‌కళ్యాణ్ అభిమాని తమ హీరో గురించి చెప్పమని కోరగా 'ఎనిగ్మా' అని సమధానం ఇచ్చాడు. దీంతో 'ఎనిగ్మా' అంటే అర్ధం తెలియని వారు డిక్షన్షరీలు, ఇంటర్‌నెట్‌లో దాని అర్ధం సేకరిస్తున్నారు. 'ఎనిగ్మా' అంటే ఎవ్వరికీ అర్ధం కాని వ్యక్తి అని, ఎవ్వరు అభివర్ణించడానికి సాధ్యపడని వ్యక్తి అని దాని అర్ధం.
మొత్తానికి పవన్ విషయంలో మాత్రం కేటీఆర్ పర్‌ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు. మరో పవన్ అభిమాని పవన్ రాజకీయాలపై స్పందించమని అడగ్గా.. 'ప్రజలు నిర్ణయిస్తారు. డిసైడ్ చేయడానికి నేనెవ్వడిని' అంటూ సూటిగా, సుత్తిలేకుండా స్పందించాడు. మొత్తానికి దటీజ్ కేటీఆర్ అని అనిపించుకున్నాడు.