Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ బయోపిక్: వర్మకి బాలయ్య షాక్!!


గత నెలలో సీనియర్ ఎన్టీఆర్ జీవిత చరిత్ర మీద బయోపిక్ లు తీస్తామంటూ చాలామంది బయలు దేరిన విషయం తెలిసిందే. అసలు ఎన్టీఆర్ బయోపిక్స్ మీద జరిగిన హడావిడి అంతా ఇంతా కాదు. ఒక రేంజ్ లో మీడియాలో ఎన్టీఆర్ బయోపిక్ హైలెట్ అయ్యింది. అన్నిటిలో ఎక్కువగా హైలెట్ అయ్యింది... మాత్రం వర్మ.  ఎన్టీఆర్ బయోపిక్ సినిమా తీస్తాను అని ప్రకటించి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసిన రామ్ గోపాల్ వర్మ ఉన్నట్టుండి సైలెంట్ అయ్యాడు. ఇప్పుడు తాను తీస్తానన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి ఎక్కడా అంటే సోషల్ మీడియాలో ఎక్కడా ప్రస్తావించడం లేదు.

Advertisement
CJ Advs

అయితే రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ బయోపిక్ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ డ్రాప్ అయినట్టే అని టాక్ సోషల్ మీడియాలో రేజ్ అయ్యింది. ప్రస్తుతం ఏపీలో టిడిపి రూలింగ్ లో ఉంది కాబట్టి వారిలో కొందరు వర్మని బెదిరించి ఈ బయోపిక్ ని వర్మ తియ్యకుండా అడ్డంపడ్డారనే న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. మరి వర్మ బెదిరింపులకు లొంగే రకం కాదాయే.. ఏం జరిగిందో ఏమో గాని ప్రస్తుతానికి వర్మ ఎన్టీఆర్ బయోపిక్ గురించిన మాటలకు మాత్రం ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇప్పుడు ప్రస్తుతానికి వర్మ... నాగ్ సినిమాతోనూ....  కడప వెబ్ సిరీస్ తోనూ బిజీగా ఉన్నాడు.

మరి వర్మ సైలెంట్ ని తనకి అనుకూలంగా మార్చుకున్న బాలకృష్ణ తన తండ్రి బయోపిక్ ని తేజ దర్శకత్వంలో సైలెంట్ గా మొదలెట్టేశాడు. మరి ఈ విషయంలో బాలకృష్ణ, తేజ మీద ఒత్తిడి తీసుకొస్తునట్లుగా వార్తలొస్తున్నాయి. అసలు తన కెరీర్ లో ఒకేసారి రెండు సినిమాలు చేయటం అలవాటు లేని తేజ తప్పని పరిస్థితుల్లో బాలకృష్ణ ఒత్తిడికి తలొగ్గినట్టుగా టాక్. ఒక పక్క వెంకటేష్ ఆటా నాదే వేటా నాదే చేస్తూ మరోవైపు బాలయ్యతో ఎన్టీఆర్ సినిమాని కూడా చేయబోతున్నట్టుగా సమాచారం అందుతుంది.

No Update on RGV NTR Biopic:

Balakrishna Starts NTR Biopic Shoot <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs