Advertisement
Google Ads BL

ఆ హీరోయిన్ని ప్రేమించానంటున్న క్రికెటర్!


మనదేశంలో హీరోయిన్లకు, క్రికెటర్లకు మంచి రిలేషన్‌ ఉంటుంది. తాజాగా విరాట్‌కోహ్లి-అనుష్కశర్మల వివాహం కూడా జరిగింది. వారు ముంబైలో ఇచ్చిన రిసెప్షన్‌కి క్రికెట్‌ ప్రముఖులే కాదు.. బాలీవుడ్‌ ప్రముఖలంతా హాజరయ్యారు. ఇక మనదేశంలో క్రికెటర్‌ నవాబ్‌ పటౌడిని షర్మిలా ఠాగోర్‌ వివాహం చేసుకుంది. అజారుద్దీన్‌ సంగీత బిజ్లానిని వివాహం చేసుకున్నాడు. ధోని, రాయ్‌లక్ష్మిల మధ్య ఎఫైర్‌ నడించింది. వివియన్‌ రిచర్డ్స్‌ ద్వారా నీనా గుప్తా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. పాకిస్థానీ క్రికెటర్లు అయిన ఇమ్రాన్‌ఖాన్‌ జీనత్‌ అమన్‌తో, వసీం అక్రమ్‌ తో సహా గంగూలీ కూడా నగ్మాతో ఎఫైర్‌ నడిపాడు.

Advertisement
CJ Advs

ఇక విషయానికి వస్తే తన ప్రచండవేగమంతమైన బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాట్స్‌మెన్‌ గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన పాకిస్థాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌కి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఆయన క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయినా కూడా ఆయనంటే తెలియని క్రికెట్‌ అభిమాని ఉండడు. అలాంటి క్రూరంగా కనిపించే షోయబ్‌ అక్తర్‌ ఏకంగా మన దేశానికి చెందిన బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనాలి బింద్రేని ఎంతగానో ప్రేమించాడట. కానీ అది వన్‌ సైడ్‌ లవ్‌. ఎలాగైనా ఆమెని కలిసి తన ప్రేమను ఎంతో సున్నితంగా చెప్పి ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని భావించానని, దానికి ఆమె మేనేజర్‌ ద్వారా అపాయింట్‌మెంట్‌ కూడా తెచ్చుకున్నానని, కానీ ప్రేమ సంగతి దేవుడెరుగు కనీసం ఆమెని స్వయంగా కలవలేకపోయానని చెప్పుకొచ్చాడు.

ఆమె తన ప్రేమను అంగీకరించకపోతే ఆమెను కిడ్నాప్‌ చేసైనా వివాహం చేసుకోవాలని భావించాడట. ఇక మరాఠీ భామ అయిన సోనాలి బింద్రే తెలుగులో 'మురారి, ఖడ్గం, ఇంద్ర, శంకర్‌దాదా ఎంబిబిఎస్‌' చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఆమె ప్రముఖ నిర్మాత గోల్డీబెహన్‌ని ప్రేమించి, పెళ్లి చేసుకుంది.

Shoaib Akhtar One Side Love Revealed:

Shoaib Akhtar wanted to kidnap Bollywood actress Sonali Bindre
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs