Advertisement
Google Ads BL

కష్టాల్లో ప్రభాస్‌ హీరోయిన్‌..!


బాలీవుడ్‌లో శ్రద్దాకపూర్‌కి మంచి ఇమేజ్‌ ఉంది. అందంతో పాటు అభినయంలో కూడా ఈమెకు మంచి మార్కులే పడతాయి. ఇక చిత్రాల ఎంపికలో, రెమ్యూనరేషన్‌ విషయంలో కూడా ఈమె మహాముదురు. తాజాగా 'బాహుబలి'తో నేషనల్‌ హీరోగా మారిన ప్రభాస్‌ 'సాహో' చిత్రంలో హీరోయిన్‌ అవకాశాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈమె ఇటీవల అండర్‌ వరల్డ్‌డాన్‌ దావూద్‌ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్‌ జీవిత చరిత్ర ఆధారంగా 'హసీనా' చిత్రంలో నటించింది. ఈ చిత్రం భారీ ఫ్లాప్‌ అయి ఆమె ఖాతోలో డిజాస్టర్‌ని చేర్చింది. ఇప్పుడు అదే 'హసీనా' చిత్రం వల్ల ఆమె మరో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది.

Advertisement
CJ Advs

ఈ చిత్రాన్ని అపూర్వలఖియా తెరకెక్కించగా, నిర్మాత నహీద్‌ ఖాన్‌ నిర్మించాడు. ఈ చిత్రం షూటింగ్‌కి ముందు ముంబైకి చెందిన ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కంపెనీతో ఈ చిత్ర యూనిట్‌ ఓ అగ్రిమెంట్‌ చేసుకుంది. ఈ చిత్రంలో వాడే హీరోయిన్‌ కాస్ట్యూమ్స్‌ అన్నింటిని తామే అందిస్తామని, ఇక తమ కంపెనీకి సినిమాలో పేరు చూపి, ప్రమోషన్స్‌ నిర్వహించడం, ప్రెస్‌మీట్స్‌ నుంచి అన్నింటిలో తమ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కంపెనీకి హీరోయిన్‌, నిర్మాతలు ప్రమోషన్‌ చేసి పెట్టాలనేది ఆ అగ్రిమెంట్‌.

కానీ నిర్మాత మాత్రమే కాదు.. హీరోయిన్‌ శ్రద్దాకపూర్‌ కూడా ఆ కంపెనీకి కనీసం ప్రమోషన్‌ చేయకుండా వదిలేశారు. దాంతో ఈ దుస్తుల కంపెనీ యాజమాన్యం ముంబైలోని అంధేరిమెట్రోపాలిటన్‌ కోర్టులో పిటిషన్‌ వేసింది. శ్రద్దాకపూర్‌పై క్రిమినల్‌ కేసును పెట్టింది. దీనిపై కోర్టులో నిర్మాత, శ్రద్దాకపూర్‌లు వివరణ ఇవ్వాల్సివుంది. ఈ కేసును నమోదు చేసి పోలీసులు కూడా విచారణ సాగిస్తున్నారు. మరి ఇది ఎంత దూరం వెళ్తుందో వేచిచూడాల్సివుంది..!

Prabhas Heroine In Lot Off Trouble:

Shraddha Kapoor To Face Legal TROUBLE Over Haseena Parkar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs