Advertisement
Google Ads BL

పవన్, వెంకీ మధ్య వచ్చే సీన్ ఇదేనా?


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం 'అజ్ఞాతవాసి'. ఈ చిత్రం మీద మొదటి నుండి భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి టీజర్, సాంగ్స్, కొడకా కోటేశ్వర సాంగ్ టీజర్ లు సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేశాయి.

Advertisement
CJ Advs

ఈ సినిమాలో వెంకటేష్ ఓ యాక్షన్ సీన్ లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా ఓ కామెడీ సీన్ లో వెంకటేష్ దర్శనమివ్వబోతున్నాడని పుకార్లు షికారు చేశాయి. అయితే తాజా సమాచారం ప్రకారం.. వెంకటేష్ 4 నిమిషాల పాటు ఓ యాక్షన్ సీన్ లో తళుక్కుమనబోతున్నాడని తెలుస్తోంది. వెంకీ - పవన్ మధ్య జరిగే ఈ ఫైట్ సినిమాకే హైలైల్ కానుందట. అయితే వెంకటేష్ ఫైట్ సీన్స్ తో పాటు పవన్ స్వయంగా పాడిన కొడకా కోటేశ్వర సాంగ్ కూడా అజ్ఞాతవాసి సినిమా సెకండ్ హాఫ్ లోనే ఉండబోతున్నాయట.

అందుకే అజ్ఞాతవాసి సినిమా సెకండ్ హాఫ్ చాలా ప్రత్యేకంగా దర్శకుడు త్రివిక్రమ్ తీర్చిదిద్దాడనే టాక్ వినబడుతుంది. ఇకపోతే పవన్ - వెంకటేష్ ల మధ్య వచ్చే ఈ ఫైట్ సీన్  పవన్ తరహాలో సీరియస్ గా ఉంటుందా.. లేదా త్రివిక్రమ్ తరహాలో కామెడీగా ఉంటుందా అన్నది తేలాల్సి ఉంది. ఇక లేటెస్ట్ గా రిలీజ్ అయిన కొడకా కోటేశ్వరావా.. మేకింగ్ వీడియో సాంగ్ ను నూతన సంవత్సర కానుకగా డిసెంబరు 31న విడుదల చేయబోతున్నారు. జనవరి 10 వరల్డ్ వైడ్ గా అజ్ఞాతవాసి సినిమా విడుదల అవుతుంది.

Venkatesh Episode in Pawan Kalyan Agnathavasi:

Venkatesh Helps Pawan Kalyan in Agnathavasi Fight
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs