Advertisement

అవికాగోర్‌ ఇప్పుడేంచేస్తుందో తెలుసా..!


నేటి హీరోయిన్లు కేవలం చిత్రాలలో నటన మాత్రమే కాదు.. పాడటం, సంగీత దర్శకత్వం, సినిమా నిర్మాణం, ప్రొడక్షన్‌ పనులు, స్క్రీన్‌ రైటింగ్‌, డైరెక్షన్‌ వంటి పలు విషయాలపై మంచి అవగాహనతో వస్తున్నారు. ఇక పాపం బాలనటిగా జాతీయ అవార్డుని తెచ్చుకుని 'కొత్త బంగారులోకం'తో పాటు కొన్ని చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న హీరోయిన్‌ శ్వేతాబసుప్రసాద్‌ ఎక్స్‌పోజింగ్‌కి నో చెప్పడం, దాంతో ఆమెకి అవకాశాలే లేక ఓ సెక్స్‌ రాకెట్‌లో పట్టుబడి, ఓ హాస్టల్‌లో ఉండి.. కౌన్సిలింగ్‌ తీసుకుని, ప్రస్తుతం ముంబైలో ఓ ప్రముఖ ప్రొడక్షన్‌ కంపెనీలో స్క్రిప్ట్‌ రైటర్‌గా, బుల్లితెరపై కనిపిస్తోంది. 

Advertisement

ఇక 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమైన టాలెంటెడ్‌ హీరోయిన్‌ అవికాగోర్‌. ఆమె 2013లో నాగార్జున నిర్మాతగా రాజ్‌తరుణ్‌తో కలిసి 'ఉయ్యాల జంపాల' చిత్రంలో నటించి పెద్ద సక్సెస్‌ అయింది. ఆ తర్వాత 'లక్ష్మీరావే మా ఇంటికి, తను నేను, సినిమా చూపిస్త మావా, ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రాలలో నటించి మంచి టాలెంట్‌ ఉన్న నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ గ్లామర్‌షో చేయకపోవడం, కాస్త బొద్దుగా ఉండటంతో ఆమె కెరీర్‌ ముందుకు సాగలేదు. దాంతో ఆమె ప్రస్తుతం ముంబైలో ఉంటూ డాక్యుమెంటరీలను తీస్తోంది. తన సహనటుడు, తనతో కలిసి 'ససురాల్‌ సిమర్‌కా' అనే సీరియల్‌లో నటించిన మనీష్‌రాయ్‌ సింఘానితో కలిసి ఈ లఘుచిత్రాలను ఆమె తీస్తోంది. దాంతో వారిద్దరు డేటింగ్‌ చేస్తున్నారని, ఎఫైర్‌లో ఉన్నవారు త్వరలో వివాహం చేసుకోనున్నారని వార్తలు గుప్పుమన్నాయి. దాంతో దీనిపై అవికాగోర్‌ స్పందించింది. 

ఈ సీరియల్‌లో నేను మనీష్‌రాయ్‌తో నటించే సమయంలో నా వయసు 13. ఆయన వయసు 35ఏళ్లు. మరి మా ఇద్దరి మధ్య ఎలా ఎఫైర్‌ నడుస్తుంది? ఇంత ఏజ్‌ గ్యాప్‌ ఉన్న వ్యక్తితో నాకు సంబంధం పెట్టడం సరికాదు.. కానీ ఎవరు ఏమనుకున్నా కూడా మా మధ్య స్నేహం చెదిరిపోదు.. మేమిద్దం కలిసే డాక్యుమెంటరీలు తీస్తున్నామని చెప్పుకొచ్చింది. ఇక తాజాగా ఈమె బాగా సన్నబడి నాజూకుగా కనిపిస్తున్న ఫొటోలు అందరినీ విపరీతంగా ఆకర్షిస్తున్నాయి...!

Avika Gor Clarity on Her Releation with Manish Roy:

Avika Gor Eye on Documentary Films
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement