Advertisement
Google Ads BL

నా వేగానికి ఏదైనా ధ్వంసమే: రానా!


'బాహుబలి-ది బిగినింగ్‌, బాహుబలి-ది కన్‌క్లూజన్‌, ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి'తో పాటు దగ్గుబాటి రానా ఇప్పుడు ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో నటిస్తున్నాడు. తెలుగు, తమిళంలో రూపొందుతున్న '1940' అనే పీరియాడికల్‌ మూవీ, గుణశేఖర్‌ దర్శకత్వంలో 'హిరణ్యకస్యప', బాబాయ్‌ వెంకటేష్‌తో కలిసి ఓ వెబ్‌సిరీస్‌లతో పాటు పలు విభిన్న చిత్రాలను లైన్‌లో పెట్టాడు. ఇక తాజాగా ఆయన నటించిన మరో చిత్రం ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. దీని పేరు 'రాజరథం'. 

Advertisement
CJ Advs

'గాలై వస్తాను.. మెరుపైపోతాను..నాది రాజవంశం...నా వేగానికి ఏదైనా ధ్వంసం... నేను నడిచే దారి రాజపధం...నాపేరు రాజరధం' అంటున్నాడు ఈ భళ్లాలదేవుడు. ఇందులో రానాతో పాటు తమిళ హీరో ఆర్య, అవంతిక శెట్టి, రవిశంకర్‌లు నటిస్తుండగా, అనూప్‌ భండారి దర్శకుడు. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ని రానా విడుదల చేయగా, ఈ ట్రైలర్‌ రానా వాయిస్‌ ఓవర్‌తో మొదలైంది. 

అనగనగా ఓ ఊరిలో.. ఓ కాలేజీలో అంటూ మొదలై సినిమాలో నటించే పాత్ర ధారుల పరిచయం సాగింది. హీరో ఆర్య ఇందులో ఎంతో విభిన్నంగా ఉన్నాడు. ట్రైలర్‌ కూడా కొత్తదనంతో ఎంతో వైవిధ్యం ఉన్న సినిమాలా అనిపిస్తోంది. ఇక చివరలో రానా చెప్పిన డైలాగ్‌లు బాగా ఆకట్టుకుంటున్నాయి. మరి చిత్ర చిత్రానికి వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటున్న రానా ఇందులో ఎలాంటి పాత్రలో నటించాడో తెలుసుకోవాలంటే ఈ చిత్రం విడుదలయ్యే వరకు వెయిట్‌ చేయాల్సిందే..! 

Click Here to See The Trailer

Rajaratham Trailer Released:

Rajaratham Movie Trailer Talk..
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs