Advertisement
Google Ads BL

పవన్ ని త్రివిక్రమ్ ఇబ్బంది పెట్టేస్తున్నాడుగా!


పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కిన 'అజ్ఞాతవాసి' సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే అజ్ఞాతవాసి టీజర్ తో సహా అజ్ఞాతవాసి పాటలు మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. ప్రమోషన్స్ లో కూడా అజ్ఞాతవాసి పీక్ లో ఉందనే విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న తీరు తెలుస్తూనే ఉంది. ఇక అజ్ఞాతవాసి ఆడియో వేడుకని కూడా మేకర్స్ అదిరిపోయే లెవల్లో నిర్వహించారు. ఆ ఫంక్షన్ లో హీరో పవన్ కళ్యాణ్ సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఇక హీరోలందరితో కంటే పవన్ కళ్యాణ్ కి అభిమాన గణం చాలా ఎక్కువే.

Advertisement
CJ Advs

ఇక పవన్ కళ్యాణ్ కి కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పక్క రాష్ట్రాల్లోనూ బోలెడుమంది అభిమానులున్నారు.  అందులోను కర్ణాటకలో పవన్ కళ్యాణ్ అభిమానులు సంఖ్య కాస్త ఎక్కువే. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి ని కర్ణాటక లో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. దాంతో పవన్ ఫ్యాన్స్ కోసం అజ్ఞాతవాసి సినిమా ప్రమోషన్ ఈవెంట్ ఒకటి బెంగుళూరులో చేయాలనీ త్రివిక్రమ్ ఇప్పటికే డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ వేడుక కోసమే బెంగుళూరులోని పవన్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం తెలుగు భారీ బడ్జెట్‌ సినిమాలకు బెంగుళూరు మార్కెట్ కూడా చెప్పుకోదగ్గ రేంజ్ లో పెరిగింది. దాంతో అజ్ఞాతవాసి విడుదలకు ముందు బెంగుళూరులో పవన్ కళ్యాణ్ ని పిలిచి భారీగా ప్రమోషన్ చేయాలని అన్నది త్రివిక్రమ్ ఆలోచన. గతంలో ఎన్టీఆర్, అల్లు అర్జున్ లు చాలాసార్లు తమతమ సినిమాల ప్రమోషన్ కోసం బెంగుళూరు వెళ్లి అక్కడ తమ ఫ్యాన్స్ ను కలిసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

మరి అజ్ఞాతవాసి ప్రమోషన్స్ కి పవన్ దూరంగా ఉంటాడు. రాజకీయాలతో బిజీగా ఉన్నకారణంగా అజ్ఞాతవాసి ప్రమోషన్స్ అన్ని త్రివిక్రమ్ చేస్తాడనే టాక్ నడిచిన నేపథ్యంలో... అజ్ఞాతవాసి ప్రమోషన్ కోసం పవన్ బెంగుళూరు వెళతాడా? అజ్ఞాతవాసి విడుదల మరో రెండు వారాల్లో ఉన్న నేపధ్యంలో ఈ లోగానే పవన్ బెంగుళూరు వెళ్ళి రావాలి. కాని పవన్ కళ్యాణ్ తన జనసేన పనులతో బిజీ గా ఉన్నాడు. మరి ఇలా అనుకోని విధంగా తనని ఇబ్బందికి గురి చేసిన త్రివిక్రమ్ డెసిషన్ కి పవన్ కళ్యాణ్ ఓకే అంటాడో లేదో చూడాలి. 

Agnathavasi Promotions in Karnataka:

Trivikram Planned Agnathavasi Promotions in Karnataka State 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs