Advertisement
Google Ads BL

కత్తి మహేష్‌ కొంచం తగ్గితే బెటర్..!


ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా కూడా మన దేశంలో రాజకీయాలు, ఆటలు, సినిమాలనేవి జనాలలో చిన్నచూపునే కలిగిస్తున్నాయి. అందుకే మనతో ఎవరైనా గిమ్మిక్‌లు ప్లే చేస్తుంటే మనం 'ఏం... నాతో పాలిటిక్స్‌ ప్లే చేస్తున్నావా? నాతో గేమ్స్‌ ఆడుతున్నావా? నాతో ఆటలాడవద్దు'.. 'ఏం.. నా ముందు వేషాలేస్తున్నావా?' అనే పదాలు ఉచ్చరిస్తూ ఉన్నారంటే వాటి పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయం అదేనని అర్ధమవుతోంది. ఇక రాజకీయాలంటేనే ఓట్ల కోసం వేసే ఎత్తులు, పైఎత్తులు, ఓటు బ్యాంకు రాజకీయాలు, కుల మత, ప్రాంతాల వారిగా ప్రజలను రెచ్చగొట్టడం అనేది కామన్‌. రాజకీయనాయకులు ఏ పని చేసినా వారి అంతిమ లక్ష్యం ఓట్లు కొల్లగొట్టడమే. కాబట్టి రాజకీయాలలో గేమ్స్‌ ప్లే చేయడం కామన్‌ అయిపోయింది. కాబట్టి ఎన్ని రాజకీయాలు, ఓటు బ్యాంకు గిమ్మిక్కులు చేసినా చివరకు ప్రజలకు, సమస్యలకు ఏదో రకంగా పరిష్కారం లభించడమే ముఖ్యం.

Advertisement
CJ Advs

వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి హయాంలో అవినీతి జరిగింది,.. జగన్‌ కోట్లు సంపాదించాడు అంటున్నారు. రాజశేఖర్‌రెడ్డి ఎందరి మద్యనో చిచ్చుపెట్టి ముఖ్యమంత్రి అయ్యాడు అనే చెడ్డపేరు ఉన్నా కూడా ఎంత అవినీతి, లోపభూయిష్టమైనా సరే.. చివరకు ప్రజలకు ఆరోగ్యశ్రీ, 108 సేవలు, ఉచిత కరెంట్‌ వంటివి ప్రజల అభిమానానికి కారణమయ్యాయి. ఇక ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌, ఆయన పార్టీ జనసేన టిడిపికి మిత్ర పక్షమా? కాదా? అనేది పక్కనపెడితే మొత్తానికి పవన్‌ లేవనెత్తుతున్న సమస్యలకి చంద్రబాబు స్పందిస్తున్నాడా? లేదా? అనేదే ముఖ్యం. 

'ఉద్దానం' బాధితుల నుంచి తాజాగా ఫాతిమా కళాశాల సమస్య వరకు పవన్‌ స్పందిస్తున్నాడు. కాస్త ఆలస్యమైనా కూడా చంద్రబాబు వాటిపై దృష్టిపెడుతున్నాడు. మొత్తానికి దీని వల్ల సమస్యలకు పరిష్కారం, మంచి జరుగుతోందా? లేదా? అనేది పరిశీలిస్తే మంచే జరుగుతోంది. కానీ పవన్‌ ఫాతిమా కళాశాల విషయంలో చంద్రబాబుకి లెటర్‌ రాయడంతో పాటు ట్వీట్స్‌ కూడా చేశాడు. ఈ విషయంపై కత్తి మహేష్‌ తన ఫేస్‌బుక్‌ వేదికగా 'మొత్తానికి ఇంతకాలం తర్వాత చంద్రబాబు ఫాతిమా కాలేజ్‌ విషయంలో స్పందించాడన్నమాట..ఈరోజు పవన్‌ ట్వీట్‌ చేశాడు. తోడుదొంగలు గేమ్‌ బాగా ఆడుతున్నారు' అంటూ వ్యంగ్యాత్మకంగా స్పందించాడు. 

పవన్‌ని చంద్రబాబుకి తొత్తు అనే వారు ఉన్నట్లే కత్తి మహేష్‌ని జగన్‌కి తొత్తు, జీతగాడు అని విమర్శించే వారు కూడా ఉన్నారు. ఇక కత్తి మహేష్‌కి వైసీపీ, జగన్‌ ఇష్టామా? లేదా? అన్నది ఆయన ఇష్టం. ఈ ప్రజాస్వామ్యంలో ఆయనకు ఏ పార్టీనైనా సమర్దించే హక్కు ఉంది. కానీ అంత మాత్రాన మంచి విషయాలపై కూడా వ్యంగ్యంగా మాట్లాడితే అది సరైన పద్దతి కాదని కత్తి మహేష్‌ తెలుసుకోవాల్సివుంది...! 

Kathi Mahesh Targets Pawan and CM Chandrababu:

Kathi Mahesh Comments on Pawan and Chandrababu Friendship 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs