Advertisement
Google Ads BL

సల్మాన్ కి అలా సుడి తిరిగింది..!


బాలీవుడ్ లో ఈ ఏడాది 2017 బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద ఒక్క బాహుబలి తప్ప ఏ సినిమా కూడా అదిరిపోయే కలెక్షన్స్ సునామి సృష్టించలేకపోయింది. అయితే బాహుబలి కూడా బాలీవుడ్ స్ట్రయిట్ సినిమా కాదు. ఒక్క బాలీవుడ్ స్ట్రయిట్ బడా సినిమా కూడా బాహుబలిని కొట్టలేక చతికిల పడ్డాయి. అయితే బాలీవుడ్ బాక్సాఫీసు ఈ దెబ్బకి బాగా  డౌన్ అయ్యింది అనుకున్నారు. మరి అనుకోరు..... ఒక్క గోల్ మాల్ ఎగైన్ తప్పా ఏ సినిమా అంతగా భారీ విజయాన్ని అందుకోలేదు.  సల్మాన్ ఖాన్ కూడా ట్యూబ్ లైట్ తో బాక్సాఫీసును చీల్చి చెండాడుదాం అంటే.. ట్యూబ్ లైట్ టాక్, అలాగే బాలీవుడ్ క్రిటిక్స్ మాత్రం సల్మాన్ ని చీల్చి చెండాడారు. 

Advertisement
CJ Advs

ఇక ఈ ఏడాది బాక్సాఫీసు హిట్ కొట్టాలని అదే స్పీడ్ లో టైగర్ జిందా హై షూటింగ్ ని పూర్తి చేసి క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేశాడు. ఈ సినిమాతో అయినా బాలీవుడ్ బాక్సాఫీసుని షేక్ చేద్దామనుకున్నారు. షేక్ అయితే అవ్వలేదు గాని....  కలెక్షన్స్ విషయంలో మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. మొదటి నాలుగు రోజుల్లోనే  200+ కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని అందుకుంది. ఇక ఓవర్సీస్ లో  కూడా సల్మాన్ ఖాన్ తన టైగర్ జిందా హై తో ప్రతాపాన్ని బాగానే చూపిస్తున్నాడు. విడుదలకు ముందు నుంచే విదేశాల్లో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగాయి. అందులోను మాజీ ప్రేమికులు సల్మాన్ ఖాన్ - కత్రినా కైఫ్ లు కలిసి నటించడంతో ఈ సినిమాపై క్రేజ్ మరింతగా పెరిగింది.

ఇకపోతే సల్మాన్ టైగర్ జిందా హై ఓవర్సీస్ లో ఎంత కొల్లగొట్టింది అనేది....  బాలీవుడ్ బాక్సాఫీసు ఎనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ చెప్పిన వివరాల ప్రకారం.. ఇప్పటి వరకూ 8.55 మిలియన్ డాలర్లను రాబట్టింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 54.79  కోట్లు కొల్లగొట్టిందని చెబుతున్నాడు. అలాగే అక్కడ మరింతగా కలెక్షన్స్ పెరిగే అవకాశం లేకపోలేదంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం బాలీవుడ్ లో జనవరి నెలాఖరు వరకు మరే బడా సినిమా లేకపోవడంతో సల్మాన్ కి కలిసొచ్చే అంశం గా చెబుతున్నారు.

Salman Tiger Roaring at Box Office:

Salman Khan Tiger zinda Hai Movie Collections Sensation
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs