Advertisement
Google Ads BL

పూరీ 'హగ్'లో ఇన్ని ఉన్నాయా వర్మా..!


ఒకవైపు వర్మ నాగార్జునతో చిత్రం చేస్తూనే మరో వైపు 'కడప' అనే హింసాత్మక వెబ్‌సిరీస్‌ని చేస్తు, టీజర్‌ని కూడా వదిలి నానా హంగామా చేస్తున్నాడు. పనిలో పనిగా కడప ఫ్యాక్షనిజం, కత్తులు, నరకడాలతోపాటు ఆ చిత్రం టైటిల్‌ సాంగ్‌లో కూడా ఈ వెబ్‌సిరీస్‌ ఎలా ఉంటుందో చెప్పేశాడు. మరోపక్క ఆయన ప్రియశిష్యుడు పూరీ జగన్నాథ్‌ కూడా తాను మొదటిసారిగా తీస్తున్న 'హగ్‌' షార్ట్‌ఫిల్మ్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని వదిలాడు. ఇందులో దిగంబరంగా ఉన్న ఓ యువతి ఓ అడవిలో చెట్టు బెరడను కౌగిలించుకుంటూ ఉన్న ఈ పోస్టర్‌ ఎంతో సంచలనం సృష్టించింది. ఇక ఈ షార్ట్‌ ఫిల్మ్‌ని న్యూఇయర్‌ గిఫ్ట్‌గా డిసెంబర్‌ 31వ తేదీ 10గంటలకు విడుదల చేస్తానని, 'గెట్‌ రెడీ ఫర్‌ దిస్‌ వన్‌' అంటూ పూరీ తన అభిమానులకు ట్వీట్‌ ద్వారా తెలిపాడు. 

Advertisement
CJ Advs

తాజాగా వర్మ ఈ షార్ట్‌ఫిల్మ్‌పై స్పందించాడు. ఇప్పుడే పూరీ తీసిన 'హగ్‌'ని పూర్తిగా చూశాను. అద్భుతమైన కళాఖండం. భిన్నమైన భావోద్వేగాలు, ఉత్తేజం, ప్రేరణ వంటివి ఈ షార్ట్‌ ఫిల్మ్‌ కలిగిస్తోందని ఫేస్‌బుక్‌ ఖాతాలో తెలిపాడు. ఈ సందర్భంగా పూరీ పోస్ట్‌ చేసిన పోస్టర్‌ని రాంగోపాల్‌ వర్మ తన ఖాతాలో జతపరిచాడు. మొత్తానికి శిష్యుడు చేసే షార్ట్‌ ఫిల్మ్‌కి వర్మ ప్రమోషన్‌ చేసి పెట్టాడు. 

మరి వర్మ తీసే 'కడప' వెబ్‌సిరీస్‌కి కూడా పూరీ ఆకాశానికి ఎత్తేస్తాడని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇలా గురు శిష్యులిద్దరు ప్రస్తుతం ఫ్లాప్‌లలో ఉండి ఒకరి మీద ఒకరు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇక పూరీ అంటే వర్మకి అలవికాని అభిమానం. డ్రగ్స్‌ విషయంలో కూడా వర్మ అంతలా రెచ్చిపోవడానికి కారణం అందులో పూరీ కూడా ఉండటమే. 

ఇక 'పైసా వసూల్‌' ట్రైలర్‌ని చూసి కూడా వర్మ పూరీని ఆకాశానికి ఎత్తేసిన విషయం తెలిసిందే. అంతకుముందు పూరీకి బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌తో 'బుడ్డా హోగా తేరీ బాప్‌'కి అవకాశం ఇప్పించిన విషయం కూడా తెలిసిందే. సో వీరిద్దరు ఒకరిపై ఒకరు ఈగ వాలినా కూడా సహించలేనంత గట్టిగా తమ అనుబంధాన్ని పెంచుకుంటూ ఉన్నారు. 

RGV Praises Puri Jagannadh Hug:

Ram Gopal Varma Promotes Puri Jagannadh Short Film Hug
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs