Advertisement
Google Ads BL

ఇలా అయితే ఎలా మహేష్..?!


కొరటాల శివ డైరెక్షన్ లో మహేష్ బాబు చేస్తున్న 'భరత్ అనే నేను' సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల అవుతుందని అధికార ప్రకటన కూడా చేశారు. ఈ సినిమాకు దగ్గరగా బన్నీ నటించిన 'నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా' అలానే రామ్ చరణ్ మూవీ 'రంగస్థలం' కూడా విడుదల కాబోతున్నాయి. వీటితో పాటు రజిని 'రోబో 2.0' కూడా వస్తుంది.

Advertisement
CJ Advs

అయితే 'రంగస్థలం' సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ఆల్రెడీ రిలీజ్ అయింది. అలానే బన్నీ సినిమా  'నా పేరు సూర్య' కి సంబంధించి జనవరి 1న ఫస్ట్ ఇంపాక్ట్ అంటూ టీజర్ ను రిలీజ్ చేస్తున్నారు. రజిని సినిమా '2.0' ఆడియో రిలీజ్ అయ్యి సాంగ్స్ అన్నీ బయటకు వచ్చేశాయి. కానీ కొరటాల - మహేష్ సినిమాకు సంబంధించి ఒక్క లుక్ కూడా బయటకు రాలేదు.

మహేష్ ఫాన్స్ స్పైడర్ ప్లాప్ తో డిప్రెషన్ లో ఉంటే.. కనీసం 'భరత్ అనే నేను' లుక్ తో అయినా న్యూ ఇయర్ సంబరాలు జరుపుకుందాం అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు కొరటాల నుంచి ఏ ప్రకటన లేకపోవడంతో మహేష్ ఫ్యాన్స్ నిరాశకి గురవుతున్నారట. మరి కనీసం సంక్రాంతి కన్నా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తాడో లేదో చూడాలి.

Mahesh Babu Disappoints Fans in New Year :

No New Year Treat to Mahesh Babu Fans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs