Advertisement
Google Ads BL

ఇలియానా పెళ్లిపై ఇంతకంటే ఏం క్లారిటీ కావాలి?


'దేవదాసు'తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై 'పోకిరి'తో పాటు అందరు యంగ్‌స్టార్స్‌ సరసన నటించిన నడుము సుందరి ఇలియానా. ఈ గోవాబ్యూటీ తెలుగులో మొదటిసారి కోటి రూపాయల పారితోషికం తీసుకున్న హీరోయిన్‌గా రికార్డులకెక్కింది. ఇక ఆ తర్వాత దక్షిణాది సినిమాలకు గేట్లు మూసేసి, బాలీవుడ్‌ ద్వారాలు తెరిచింది. ఇక బాలీవుడ్‌లో ఆమె నటన ద్వారా కంటే వ్యక్తిగత విషయాల ద్వారానే వార్తల్లో నిలిచింది. 

Advertisement
CJ Advs

ఆస్ట్రేలియన్‌ ఫొటో గ్రాఫర్‌ అండ్రూ నీబోన్‌తో ప్రేమాయణం సాగిస్తోంది. వీరు పీకలోతు ప్రేమలో మునిగిపోయి ముంబైలో కాపురం పెట్టారని కూడా బిటౌన్‌ వర్గాలు అంటున్నాయి. ఇక తమ మధ్య రిలేషన్‌ని ఇల్లి బేబీ ఇప్పటివరకు ఎక్కడా దాచేందుకు ప్రయత్నించలేదు. బాలీవుడ్‌ మీడియాలోనే కాదు.. సోషల్‌ మీడియాలో కూడా తన బోయ్‌ఫ్రెండ్‌తో తీసుకున్న ఫొటోలను పోస్ట్‌ చేస్తూ వచ్చింది. ముఖ్యంగా ఇల్లిని ఆమె ప్రేమికుడు అండ్రూనీబోన్‌ తీసిన ఫోటోలలో ఎంతో హాట్‌గా, ఎవరూ చూపించని అందాలను కూడా తన కెమెరాలో బంధించాడు. వాటిని ఆమె సోషల్‌మీడియాలో పెడుతూ వార్తల్లో నిలుస్తోంది. ఆ మధ్య ఓ ఫొటోని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసి నాలాగే మీరు కూడా మీ బెటర్‌ హాఫ్‌లని ఎంచుకుని ఎంజాయ్‌ చేయండి అని కామెంట్‌ చేసింది. 

తాజాగా క్రిస్మస్‌ సందర్భంగా ఆమె సంవత్సరంలో నాకు నచ్చిన అత్యంత ఇష్టమైన రోజు అంటూ క్రిస్మస్‌ని గురించి కామెంట్‌ చేసి, ఈ ఫొటోలు తీసింది నా హబ్బీ అని తెలిపింది. 'ఫొటో బై హబ్బీ.. అండ్రూ నీబోన్‌ ఫొటోగ్రఫీ' అనడంతో ఆమె పెళ్లయి పోవడంతోనే ఆండ్రూని హబ్బీ అందని కొందరు... ప్రేమ మరింతగా ముదరడంతో పెళ్లి కాకపోయినా హబ్బీ అని సంబోధించిందని కొందరు అంటూ సోషల్‌మీడియాలో పలు రకాలుగా స్పందిస్తున్నారు. 

Ileana triggers marriage rumours:

Ileana and Andrew Kneebone come clear about their romantic mystery
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs