Advertisement
Google Ads BL

దిల్‌రాజుపై పొగడ్తలే పొగడ్తలు!


దిల్‌రాజు డిస్ట్రిబ్యూటర్‌గా ఐదు వేల రూపాయల కోసం కూడా ఎందరినో అడిగే స్థాయి నుంచి ఈ స్టేజీకి వచ్చాడు. నిజానికి ఆయనను నిలబెట్టిన చిత్రం 'పెళ్లిపందిరి'. కోడిరామకృష్ణ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా వచ్చిన ఈ చిత్రం నాటి నిర్మాత కాస్టూమ్స్‌ కృష్ణ పుణ్యమేనని చెప్పాలి. ఇక తాజాగా ఈ ఏడాది వరుసగా ఆరు హిట్స్‌ కొట్టినందుకు దిల్‌రాజు సక్సెస్‌ జర్నీ పేరుతో ఓ వేడుకను నిర్వహించారు. 

Advertisement
CJ Advs

ఈ సందర్బంగా దిల్‌రాజుకి నిర్మాతగా లైఫ్‌ ఇచ్చిన కోడిరామకృష్ణ మాట్లాడుతూ, పెళ్లిపందిరి చిత్రం దిల్‌రాజుకే కాదు ఎంతో మందికి టర్నింగ్‌ పాయింట్‌. సినీ పరిశ్రమకు నేడు దిల్‌రాజు గర్వంగా నిలిచారు. నిర్మాతలంటే సక్సెస్‌ఫుల్‌ చిత్రాలనే కాదు.. పది మంది నిర్మాతలకు ఆదర్శంగా నిలబడి దారి చూపించాలి. దిల్‌రాజు సక్సెస్‌కి కృషి, పట్టుదల కారణం. ఇలాంటి నిర్మాతలు ఉంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఎవర్‌గ్రీన్‌గా ఉంటుందని కోడిరామకృష్ణ అన్నారు. 

దిల్‌రాజు మాట్లాడుతూ, 'పెళ్లిపందిరి' లేకపోతే ఈ వరుస ఆరు విజయాలు ఉండేవి కావు. మాబేనర్‌ ద్వారా 8మంది డైరెక్టర్స్‌ని పరిచయం చేస్తే అందులో ఏడుగురు సక్సెస్‌లో ఉన్నారు. ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేసే ఉద్దేశ్యంతోనే వినాయక్‌తో 'దిల్‌' చిత్రం తీశాం. ఈ ఆరు విజయాలు మావికావు. ఈసినిమాలకి పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్స్‌వి. హ్యాట్రిక్‌ సినిమాలు చేయాలని కలలు గన్నాను. ఈరోజున డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించాను. ఇది కలలో కూడా ఊహించలేదని దిల్‌రాజు తెలిపాడు. 

ఇక ఒకే భాషలో వరుసగా ఆరు చిత్రాలు సూపర్‌హిట్స్‌ తీయడం నిజంగా అరుదైన విషయం. ఈ విజయం దిల్‌రాజు, శిరీష్‌, లక్ష్మణ్‌లకి చెందుతుంది అని బన్నీ పొగడ్తలు గుప్పించాడు. 

నేడు దిల్‌రాజు గారు ఓ ఐకానిక్‌ ప్రొడ్యూసర్‌. ప్రొడక్షన్‌లోకి దిగాక అది ఎంత కష్టమో తెలుస్తుంది. ఈ విషయంలో దిల్‌రాజు గ్రేట్‌ అని నాని...ఈ సక్సెస్‌లో నేను కూడా పార్ట్‌నర్‌ కావడం ఆనందమని వరుణ్‌తేజ్‌, ఈ ఆరు చిత్రాల విజయం నా 'శతమానం భవతి'తో  ప్రారంభం కావడం ఆనందంగా ఉందని సతీష్‌ వేగేశ్న, '27 సినిమాలు తీస్తే అందులో 90శాతం సక్సెస్‌లు ఉండటం గ్రేట్‌' అని అనిల్‌రావిపూడి దిల్‌రాజుని పొగడ్తలలో ముంచెత్తారు. 

ఇక జయసుధ మాట్లాడుతూ, 'దిల్‌రాజుగారి చిత్రాలలో మంచి పాత్రలు చేశాను. పుదుచ్చేరికి వెళ్లి కారులోకి ఎక్కుతుంటే ఓ కుర్రాడు వచ్చి ఫొటో దిగాలని అడిగాడు. అతను తెలుగు కుర్రాడు కాదు. మీరు డాక్టర్‌ శైలజ కదా అని అడిగారు. నేను నటించిన 'ఎవడు' చిత్రం హిందీ డబ్బింగ్‌లో నా పేరు డాక్టర్‌ శైలజ' అని తెలిపింది. 

ఇక ఈ వేడుకకు కాస్ట్యూమ్స్‌ కృష్ణ రాకపోవడం మాత్రం బాధాకరం. మరి ఆయన్ను పిలిచారో, వీలు లేక రాలేదో తెలియదు. ఇక దిల్‌రాజుతోనే కలిసి నిర్మాతగా కెరీర్‌ ప్రారంభించిన ఆయన పార్ట్‌నర్‌ వెంకటగిరి మాత్రం నిర్మాతగా డిజాస్టర్స్‌ ఎదుర్కొంటే దిల్‌రాజు మాత్రం కృషి, పట్టుదలతో ఈ స్థాయికి ఎదిగాడు..! 

Celebrities Praises Dil Raju At SVC Success Celebrations:

Dil Raju Celebrates SVC Success Celebrations
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs