వాస్తవానికి తెలుగు సినీ పరిశ్రమలోని నిన్నటితరం నాలుగు స్తంభాలుగా నిలిచిన సీనియర్‌స్టార్స్‌లో అక్కినేని ఫ్యామిలీ హీరోలు, విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ అభిమానులు పెద్దగా పొగడ్తలు, ప్రశంసలను పట్టించుకోరు. కానీ మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీలు మాత్రం అలాకాదు. ఇక కృష్ణంరాజుకి చెందిన ప్రభాస్ , ఘట్టమనేని కృష్ణ వారసులు కూడా ఓ వెలుగు వెలుగుతున్నా కూడా వీరందరి హీరోలలో గానీ, వారి ఫ్యాన్స్‌లో గానీ మరీ అతి అనేది ఉండదు. సాధారణంగా డౌన్‌టు ఎర్త్‌గా ఉంటారు. కానీ మెగాఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ హీరోలే కాదు.. వారి అభిమానులు మాత్రం పొగడ్తలు, వీరాభిమానంతో ఉంటారు. ఆయా హీరోలు, అభిమానుల ధోరణి కూడా అదే విధంగా ఉంటుంది. దానికి తాజా ఉదాహరణ తాజాగా జరిగిన 'జై సింహా' ఆడియో వేడుకేనని చెప్పాలి.
ఈ ఆడియో సీడీని బాలకృష్ణ అల్లుడు, నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరిల కుమారుడు, ఏపీ మంత్రి లోకేష్ ఆవిష్కరించి తొలి సిడీని బాలకృష్ణకి అందించాడు. ఆ తర్వాత ఈ సీడీలు మరో ఎనిమిదింటిని బాలకృష్ణ ఏపీ మంత్రులకు అందజేశారు. ఏదో సినిమాలలో ఫ్యాక్షనిజం, రౌడీయిజాన్ని అరికట్టే పాత్రలు చేసినంత మాత్రాన వర్ల రామయ్య వంటివాడు మాట్లాడుతూ, రౌడీయిజాన్ని అణిచివేసే 'రౌడీ ఇన్‌స్పెక్టర్', ఫ్యాక్షనిస్ట్‌ల పీచమణిచే సమరసింహారెడ్డి బాలయ్యేనంటూ పొగడ్తలతో ముంచెత్తుతూ ఆయన నటించిన చిత్రాల పేర్లతో తెగ హడావుడి చేశాడు.
ఇక నారా లోకేష్ మాట్లాడుతూ, నేను నారా భువనేశ్వరి దేవి పుత్రుడుని. దీనికి కారణం మా మామయ్య నటించిన 'గౌతమీ పుత్ర శాతకర్ణి'నే. ఇక 1955లో వచ్చిన ఎన్టీఆర్ 'జయసింహ'ఎలాంటి సంచలనం సృష్టించిందో బాలకృష్ణ నటిస్తున్న ఈ 'జై సింహా' కూడా అంతటి చరిత్రను సృష్టిస్తుంది. బాలయ్య ఎనర్జీనే వేరు. మా పిల్లలు పెద్దయినా కూడా బాలయ్య హీరోగా చేస్తూనే ఉంటాడు అని ఆకాశానికెత్తేశాడు. తెలుగు పౌరుషానికి ప్రతీక నాటి ఎన్టీఆర్ అయితే తెలుగు సంస్కృతికి ప్రతీక బాలయ్య. బాలయ్య అపురూపమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, ఆయన తండ్రి సుగుణాలను పుణికి పుచ్చుకున్నాడు. తెలుగు భాషా సంస్కృతులను పరిరక్షిస్తున్నాడు.
ఆ కొండవీటి సింహానికి ఈ 'జై సింహా' తప్పితే మరెవ్వరు పుడతారు అంటూ మండలి బుద్దప్రసాద్, అంబికా కృష్ణలు పొగిడారు. ఎక్కువగా పవర్‌ఫుల్ డైలాగ్‌లు చెప్పే బాలయ్య చిత్రాలలో 'లం...నా కొ..' వంటి పదాలు ఎక్కువగా ఉంటాయనే విమర్శ ఎప్పటినుంచో ఉంది. జై సింహాలో కూడా అలాంటి డైలాగ్సే ఉన్నాయని అర్ధమవుతోంది. మరి తెలుగు భాషా పరిరక్షణ అంటే ఇదే కాబోలు.