Advertisement
Google Ads BL

బాలయ్య 'జై సింహా': మాస్ మసాలా..!!


తెలుగు నాట ఏయన్నార్‌ ఫ్యామిలీ అంటే క్లాస్‌లో ఎంత ఫాలోయింగ్‌ ఉంటుందో... నందమూరి వంశానికి మాస్‌లో అంతటి ఇమేజ్‌ ఉంది. నందమూరి కుటుంబం నుంచి వచ్చే వారంతా మాస్‌, యాక్షన్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పాలి. ఇక ఈ ఏడాది ఆరంభంలో 'గౌతమీపుత్ర శాతకర్ణి' వంటి చారిత్రాత్మక చిత్రంతో వచ్చిన బాలయ్య ఆ వెంటనే పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో 'పైసావసూల్‌'లో కాస్త వెరైటీ యాంగిల్‌లో కనిపించినా కూడా ఈ చిత్రం దారుణ పరాజయాన్ని రుచిచూసింది. దాంతోబాలయ్య మరోసారి తనకి అచ్చివచ్చే పవర్‌ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తన 102వ చిత్రాన్ని తమిళ మాస్‌ దర్శకుడు కె.యస్‌.రవికుమార్‌తో 'జై సింహా'గా వస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలోకి దిగుతోన్న ఈ చిత్రం టీజర్‌ విడుదలైన నాలుగు రోజులకే ట్రైలర్‌తో బాలయ్య నందమూరి అభిమానులను ఖుషీ చేశాడు.ఇక ఈచిత్రం ఎలా ఉండనుందో టీజర్‌ని చూస్తేనే ఓ అంచనాకి వచ్చిన ప్రేక్షకులకు ఇప్పుడు ట్రైలర్‌తో ఫుల్‌మీల్స్‌ రెడీ చేస్తున్నానని బాలయ్య స్పష్టంగా చెప్పేశాడు. ఈ చిత్రం నిండా బాలయ్య నుంచి ఆయన అభిమానులు ఆశించే హైఓల్టేజ్‌ యాక్షన్‌సీన్స్‌, మాస్‌ హీరోయిజం ఎలివేషన్స్‌, పవర్‌ఫుల్‌, పంచ్‌డైలాగులకు కొదువ లేదని తేలిపోయింది. టీజర్‌లో చెప్పిన 'సింహం మౌనాన్ని సన్యాసం అనుకోవద్దు' అనే డైలాగ్‌ని మరోసారి ట్రైలర్‌లో కూడా వినిపించారు. మరోవైపు ఈ ట్రైలర్‌ 'ఎవడ్రా వాడు..ఆ కళ్లలో పవరేంటి? ఎక్కడి నుంచి వచ్చాడు' అనే డైలాగ్‌తో స్టార్ట్‌ చేసి 'సింహం మౌనాన్ని సన్యాసం అనుకోవద్దు, సైలెంట్‌గా ఉందని కెలికితే తల కొరికేస్తది'... 'సింహాన్ని చంపాలంటే ట్రైనింగ్‌ తీసుకోవాలి.. నరసింహాన్ని కొట్టాలంటే టైమింగ్‌ తెలిసుండాలి...'.. 'నువ్వంటే కుంభకోణానికి భయం... నేనంటే రెండు రాష్ట్రాలకు ప్రాణం' వంటి డైలాగ్స్‌తో పాటు 'బొమ్మతిరగేస్తా.. నీ....' అంటూ సెన్సార్‌వారికి పని చెబుతూ ఓ బూతుడైలాగ్‌ని చెప్పడం కనిపిస్తుంది. బాలయ్య అభిమానులకు ఇవే ముఖ్యం కాబట్టి ఈ చిత్రం మిగిలిన ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుంటుందో తెలియదు గానీ ఆయన అభిమానులను మాత్రం బాగా ఆట్టుకోవడం ఖాయమని తేలుతోంది. ఇక నయనతార, ప్రకాష్‌రాజ్‌ లుక్స్‌, బాలయ్య నయనతారతో పాటు ఇద్దరు యంగ్‌ హీరోయిన్స్‌తో జరిపిన రొమాన్స్‌, బ్రహ్మానందంని చూపిస్తూ ఉన్న ఈ చిత్రంలో కె.యస్‌.రవికుమార్‌ తమిళుడు కావడంతో ట్రైలర్‌లోనే తమిళ వాసన బాగా కనిపిస్తోంది. 

Advertisement
CJ Advs

Click here for Jai Simha Trailer:

Jai Simha Theatrical Trailer Report:

Natasimham Nandamuri Balakrishna's Jai Simha theatrical trailer was released on Sunday, December 23.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs