Advertisement
Google Ads BL

ఈ హీరో సినిమాలో కూడా భూమిక..!!


ఒకప్పటి హీరోయిన్ భూమిక పెళ్లి చేసుకుని సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు తెలుగులో మళ్ళీ నాని - సాయి పల్లవి - దిల్ రాజుల కలయికలో వచ్చిన ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమాలో నాని కి వదిన పాత్రలో మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. భూమిక హీరోయిన్ గా స్టార్ హీరోల పక్కన బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి ఎలా ఆకట్టుకుందో.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంసీఏ లోను భూమిక అదిరిపోయేలా నటించి మెప్పించింది. భూమిక ఎంసీఏ సినిమాకి బ్యాక్ బోన్ లా నిలిచిందని... క్రిటిక్స్ ముక్త ఖంఠంతో చెప్పారు.

Advertisement
CJ Advs

పెళ్లి తర్వాత హీరోయిన్ కేరెక్టర్స్ మాత్రమే చెయ్యాలని మడి కట్టుకుని కూర్చోకుండా భూమిక ఇలా అక్క, వదిన పాత్రలకు సై అనడం గర్వించదగిన విషయమే. అయితే ఎంసీఏ లో జ్యోతిగా, నానికి వదినగా నటనలో సూపర్బ్ అనిపించుకున్న భూమికకు ఈ ఎంసీఏ సినిమా మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టేలా కనబడుతుంది. ఇప్పటికే భూమిక...  నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న సవ్యసాచిలో ఒక కీ రోల్ దక్కించుకున్నట్లు సమాచారం. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమిళ హీరో మాధవన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే భూమిక, మాధవన్ కి జోడీగా కనిపించే అవకాశమున్నట్లు చెబుతున్నారు.

అయితే ఈ సినిమాలో భూమిక తన పాత్ర గురించి వివరాలు చెప్పలేదు కానీ.. ఈ చిత్రంలో తాను మంచి పాత్ర చేస్తున్న మాట మాత్రం వాస్తవమని ఓ ఇంగ్లిష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మరి ఇలా మరో మంచి ఆఫర్ ని దక్కించుకున్న భూమిక సెకండ్ ఇన్నింగ్ లో బాగానే సెటిల్ అయ్యేలా కనబడుతుంది.

Bhoomika in Naga Chaitanya Savyasachi:

After MCA, Bhoomika in Naga Chaitanya Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs