Advertisement
Google Ads BL

సెన్సార్ బోర్డు చుక్కలు చూపిస్తుందిగా!!


గతంలో ఎప్పుడు లేనిది ఈ మధ్యన సెన్సార్ బోర్డు దెబ్బకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ గుడ్లు తెరుస్తుంది . ఈమధ్యకాలంలో కొన్ని సినిమాల విషయంలో సెన్సార్ బోర్డు కఠినంగా వ్యవహరిస్తోంది. అలాగే మొన్నామధ్యన ‘ఉడ్తా పంజాబ్, బాబూ మషాయ్ బందూక్ బాజ్’ సినిమాలకు చుక్కలు చూపించిన సెన్సార్ బోర్డు ఇప్పుడు తాజాగా  ‘పద్మావతి’ సినిమా విషయంలో కూడా అలాగే ప్రవర్తిస్తుంది. 'పద్మావతి' సినిమా సెన్సార్ బోర్డు నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొని సినిమా విడుదల ఎప్పుడో కూడా చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement
CJ Advs

మరి సెన్సార్ కష్టాలతో కొన్ని సినిమాల విషయంలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు మరో వివాదాస్పద సినిమా తెరమీదికి వచ్చింది. అదే ‘థాకరే’ సినిమా. శివసేన వ్యవస్థాపకుడు.. మహారాష్ట్రలో టైగర్‌గా గుర్తింపు తెచ్చుకున్న బాల్ థాకరే జీవిత కథతో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ ‘థాకరే’. ఈ మధ్యనే ‘థాకరే’ టీజర్ రిలీజైంది. టీజర్ మొత్తం  హిందు, ముస్లిం మధ్యన జరిగిన గొడవల మీదే నడిచినట్లుగా చూపించారు. థాకరే ముస్లింల నుంచి హిందువుల్ని కాపాడే వీరుడిగా గుర్తింపు పొంది.. ఆ నేపథ్యంలోనే పెద్ద నాయకుడిగా ఎదిగాడు. టీజర్ ఆ విషయాన్ని ప్రతిబింబించేలాగే ఉంది.

అయితే ఇందులో ముస్లింలను విలన్లుగా చూపించడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా ఇది వివాదాలు రాజేసేలా ఉంటుందన్న అంచనాలున్నాయి మొదలయ్యాయి కూడా. మరి టీజర్ విషయంలో గమ్మునున్న వాళ్ళు సినిమా విడుదల సమయం దగ్గరపడేటప్పుడు ఎలాంటి వివాదాలకు తెర లేపుతారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అభిజీత్ పనాసె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2019 జనవరి 23న విడుదల కానుంది. ఇకపోతే ముందు టీజర్ వరకు షూట్ చేసిన ఆ తర్వాత సినిమా చిత్రీకరణ మొదలుపెట్టనున్నారు.

Censor Troubles to Biopic Movies:

Censor Board Serious on Biopic Movies 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs