Advertisement
Google Ads BL

హీరో నాని వేస్ట్ ఫెలోనా..?


నేచురల్ స్టార్ నాని.. హీరో సిద్దార్థ్ మంచి స్నేహితులు అని తెలిసిందే. ఒకప్పుడు సిద్దార్థ్ తెలుగులో హల్చల్ చేసి కోలీవుడ్ కి వెళ్ళిపోయాడు. రీసెంట్ గా విడుదలైన సిద్దార్థ్ సినిమా 'గృహం' తెలుగులో ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చాడు. ఈ సినిమా ట్రైలర్ నానితో లాంచ్ చేయించాడు.

Advertisement
CJ Advs

నాని నిర్మాణంలో ‘అ’ సినిమా రాబోతుంది. ఈ సినిమాపై సిద్ధు ట్విట్టర్లో సరదాగా స్పందించాడు. వీళ్లిద్దరి మధ్య సాగిన సంభాషణ ఆసక్తిని కలిగించింది. ముందుగా నాని ఈ చిత్రంలో తాను వాయిస్ ఓవర్ ఇస్తున్న చేప పాత్రని పరిచయం చేస్తూ.. 'నా తర్వాత సినిమా పాత్ర కోసం స్విమ్మింగ్ కూడా నేర్చుకుంటున్నా..' అని ట్వీట్ చేశాడు. దీనిపై సిద్దార్థ్ స్పందిస్తూ..  'ఈ సినిమా స్క్రిప్ట్ - బృందం గురించి గొప్ప విషయాలు విన్నాను. తొందరగా సినిమా విడుదల చేయి సోదరా'.. అన్నాడు.

అయితే సిద్దార్థ్ ట్వీట్ పై.. 'ఓ అభిమాని..ఈ సినిమాలో మీరు కూడా నటిస్తున్నారా..' అని అడిగాడు. దానికి  బదులుగా సిద్ధు.. 'నేనూ చేయాలనే అనుకున్నా.. కానీ ఆ నిర్మాత వేస్ట్ ఫెలో. నన్ను రిజెక్ట్ చేశాడు..' అని చమత్కరించాడు. దీనిపై నాని ఏమీ స్పందించలేదు. మరి దీనిపై నాని ఎలా పంచ్ వేస్తాడో చూడాలి.

Funny Comments between Nani and Siddharth:

Hero Siddharth Reacted on Nani Awe Movie 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs