Advertisement
Google Ads BL

'ఒక్కక్షణం'తో కొట్టేట్లే వున్నాడు..!!


పేరుకి పెద్ద మెగా కాంపౌండ్‌ హీరో.. మరో వైపు ఆయన సోదరుడు అల్లుఅర్జున్‌ స్టైలిష్‌ స్టార్‌గా దూసుకెళ్తూ, యావరేజ్‌ చిత్రాలను కూడా బ్లాక్‌బస్టర్స్‌గా మార్చేస్తున్నాడు. తండ్రి నిర్మాణంలో, కథలు, దర్శకులు ఇతర విషయాల ఎంపికలో గొప్పవ్యక్తి . అయినా కూడా అల్లుఅరవింద్‌ గారి చిన్నబ్బాయ్‌ అల్లు శిరీష్‌కు పెద్ద హిట్‌ లేదు. ఏదో 'శ్రీరస్తు-శుభమస్తు' మాత్రమే ఫర్వాలేదనిపించింది. ఇక మలయాళంలో ఓ చిత్రం చేసినా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో ఈనెల 28న విడుదలకు సిద్దమవుతున్న 'ఒక్క క్షణం' చిత్రం అల్లుశిరీష్‌కి లైఫ్‌ అండ్‌ డెత్‌గా మారింది. అందునా నిఖిల్‌ హీరోగా 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రంతో సెన్సేషన్‌ సృష్టించిన విఐ ఆనంద్‌ దర్శకుడు.

Advertisement
CJ Advs

ఇక ఈ చిత్రం టీజర్‌ ఆ మధ్య విడుదలైంది. రెండు జంట జీవితాలలో ఒకే తరహా సంఘటనలు జరగడం అనే పాయింట్‌ మీద ఈ చిత్రం ఉన్నట్లు అర్ధమవుతోంది. ఇక ఇదో థ్రిల్లర్‌ మూవీ అని అందరూ భావించారు. ఇక టీజర్‌లో అల్లుశిరీష్‌ 'నేను ప్రేమించిన అమ్మాయి ప్రాణాల మీదకు వస్తే ఫేట్‌తోనైనా, డెస్టినీతోనైనా, చివరకు చావుతోనైనా పోరాడుతా' అని డైలాగ్‌ చెప్పాడు. ఈ చిత్రానికి లవ్‌ వర్సెస్‌ డెస్టినీ అనేది ఉప శీర్షిక కావడంతో ఈ చిత్రంపై మరింత అంచనాలు పెరిగాయి.

తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని కూడా రిలీజ్‌ చేశారు. ఇందులో అల్లుశిరీష్‌ సురభిల మధ్య లవ్‌ కెమిస్ట్రీని చూపించగా మరో వైపు అవసరాల శ్రీనివాస్‌, అతడిని వశపరుచుకునే పాత్రలో సీరత్‌కపూర్‌లు కనిపించారు. సో.. ఈ చిత్రం ఈ రెండు జంటల మధ్య జరిగే సంఘటనలకు, సైన్స్‌ని మిక్స్‌ చేసి, అగ్గిపుల్ల థియరీతో సాగే థ్రిల్లర్‌గానే గాక ఇందులో లవ్‌ యాంగిల్‌కూడా ఉందని అర్ధమవుతోంది. ఈ ట్రైలర్‌కి ప్రధాన ఆకర్షణ స్వరబ్రహ్మ మణిశర్మ అందించిన బీజీఎం. ఇదే మణిశర్మకి చివరి చిత్రం అని కొందరు అంటున్నారు. ఇన్ని విశేషాల మధ్య విడుదలవుతున్న 'ఒక్కక్షణం' అయినా శిరీష్‌కి ఒక్క హిట్‌ని ఇస్తుందేమో వేచిచూడాల్సివుంది!

Click Here for Okka Kshanam Theatrical Trailer

Okka Kshanam Theatrical Trailer Report:

Allu Sirish's Okka Kshanam Trailer Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs