పవన్ కళ్యాణ్ సినిమా జీవితంలో ఆయనతో సుదీర్ఘంగా ప్రయాణం చేస్తూ ఫ్రెండ్ షిప్ ని కంటిన్యూ చెయ్యలేరని రూమర్ వుంది. ఆయనతో నాలుగైదేళ్లు కలిసున్న వాళ్లే పవన్ తో విసిగిపోయి.. పక్కకి పోతారనే నానుడి ఉంది. అలాంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. పివిపి, శరత్ మారార్, బండ్ల గణేష్ వంటి వారు పవన్ వెన్నంటే ఉండి కొంత కాలానికి పవన్ కి దూరమయ్యారు. ఒక త్రివిక్రమ్ మాత్రమే పవన్ తో ఎక్కువ కాలం జర్నీ చేసిన వ్యక్తి. అలాగే పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ తో ఎంత సన్నిహితంగా ఉంటాడో.. సినిమాల దగ్గరికి వచ్చేసరికి కమెడియన్ అలీతోను అంతే స్నేహంగా జాలీగా ఉంటాడు.
అయితే ఇప్పుడు పవన్, అలీ గురించిన ఒక షాకింగ్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. పవన్ కళ్యాణ్, అలీలు విడిపోయారని... సోషల్ మీడియాలో అనేక వార్తలు అభిమానులను పిచ్చెక్కిస్తున్నాయి.. ఎందుకంటే మాములుగా పవన్ ప్రతి సినిమాలో ఆలీ ఉంటాడు. ఆలీ లేకుండా తన సినిమాలు ఉండవని అలీ తనకి గుండెకాయ అని పవన్ చాలా సందర్భాల్లో ఓపెన్ గానే చెప్పాడు. అయితే ఇప్పుడు అజ్ఞాతవాసి సినిమాలో ఆలీ నటించడం లేదని తెలియగానే వారిద్దరి మధ్య విబేధాలు వచ్చాయని హాట్ హాట్ న్యూస్ లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అయితే పవన్ - అలీల మధ్యన ఎటువంటి అపార్ధాలకు చోటు లేదని... వారి మధ్యన ఎటువంటి అపోహలు లేవని పవన్ - అలీల మీద వచ్చిన న్యూస్ ని పవన్ కళ్యాణ్ సన్నిహితులు కొట్టిపడేస్తున్నారు. అజ్ఞాతవాసిలో అలీకి మంచి పాత్ర లేకపోవడం వలెనే అలీ ఈ సినిమాలో నటించలేదని.. అంతకు మించి మరేది లేదని వారు చెబుతున్న మాట. ఇకపోతే పవన్ - త్రివిక్రమ్ ల అజ్ఞాతవాసి సినిమా జనవరి 10 న విడుదల కాబోతుంది.