Advertisement
Google Ads BL

‘ఎంసీఏ’: ... కోయిల ముందే కూసింది!


గురువారం విడుదల అయిన ‘ఎంసీఏ’ సినిమాకి ప్రేక్షకుల నుండి మిక్సడ్ టాక్ వచ్చింది. గత ఏడు సినిమాలు నుండి మంచి ఫామ్ లో ఉన్న నాని ఈ సినిమాతో పరాజయం చవిచూడక తప్పేట్టుగా కనబడ్డం లేదు. నిర్మాత దిల్ రాజుకి కూడా ఈ సినిమా పైసలు తెచ్చిపెట్టేలా లేదు. ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపించుకున్నా.... సెకండ్ హాఫ్ వీక్ అవడంతో  క్రిటిక్స్ నుండి కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ ఒక్క సినిమానే ఈ వారం బరిలో ఉంటే.. మిక్సడ్ టాక్ తెచ్చుకున్నా.. మంచి కలెక్షన్స్ సాధించేది. కానీ ఈ సినిమాకి పోటీగా నాగ్ తన చిన్న కొడుకు 'హలో' ని దింపుతున్నాడు.

Advertisement
CJ Advs

అయితే 'ఎంసీఏ' మీద ప్రేక్షకులు అభిప్రాయం ఎలా ఉన్నా.. ఈ సినిమా నిర్మాత దిల్ రాజు సాయంత్రానికే సక్సెస్ మీట్ పెట్టేసి.. తన సినిమా సూపర్ హిట్ అని ప్రకటించుకున్నాడు. నేను నిజాయితీగా  చెబుతున్నా అని.. ఉదయం 4.30కు న్యూజెర్సీ నుంచి ‘ఎంసీఏ’ గురించి ఫస్ట్ రిపోర్ట్ వచ్చిందని.. తర్వాత మంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందని..... ఫస్ట్ హాఫ్ ని అందరు మెచ్చుకున్నారు.. కానీ సెకండ్ హాఫ్ వీక్ అంటున్నారు అయినప్పటికీ క్లైమాక్స్ విషయంలో మెచ్చుకుంటున్నారని దిల్ రాజు అన్నాడు.

సినిమా ఎంత చెత్తగా ఉన్నా.... తర్వాత రోజు లేకుంటే మూడో రోజు సక్సెస్ మీట్ పెట్టి మా సినిమా సూపర్ హిట్ అని టామ్ టామ్ చేసుకోవడం మన ప్రొడ్యూసర్స్ కి అలవాటే. ప్రేక్షకులు మాత్రం ఎంసీఏకు వసూళ్లు వచ్చే అవకాశం లేదని సినిమా చాలా రొటీన్ గా ఉందని సెకండ్ హాఫ్ చాలా రొటీన్ గా ఉందని అంటుంటే.... ఇక్కడ దిల్ రాజు మాత్రం సినిమా విడుదలైన రెండో షోకే సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసుకోవడం చూస్తుంటే.. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని అనుకున్నట్టుగా ఉందంటూ సెటైర్స్ వేస్తున్నారు నెటిజన్లు.

Netizens Satires On MCA Success Meet:

Dil Raju speech at MCA Success Meet
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs