సెప్టెంబర్ నెలలో టాలీవుడ్ ని ఒక కుదుపు కుదిపిన డ్రగ్స్ కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది. దాదాపు రెండు నెలల పాటు మీడియా మొత్తం ఈ డ్రగ్స్ కేసు మీదే ఫోకస్ పెట్టింది. మినిట్ టు మినిట్ ఈ కేసు గురించిన న్యూస్ లే మీడియా ప్రముఖంగా ప్రచురించింది. అయితే దాదాపు రెండు నెలల పాటు హాట్ టాపిక్ అయిన ఈ కేసు ఈమధ్యవరకు సైలెంట్ అవడంతో.. ఇక ఈ కేసు మరుగున పడి ఇండస్ట్రీలోని పెద్దలు, బడా నేతలు తప్పించుకున్నారని.. అందరూ అనుకున్నారు. అయితే మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ కేసు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించడానికి రెడీ అయ్యింది.
దాదాపు 12 మంది సినీ ప్రముఖులను ఈ డ్రగ్స్ కేసులో విచారించిన సిట్ అధికారులు వారిలో ఎవరు డ్రగ్స్ సేవించారనే విషయాన్నీ మాత్రం ఇప్పటి వరకు బయటపెట్టలేదు. వారిలో కొంతమంది తమ బ్లడ్ శాంపిల్స్ ఇవ్వగా మరికొందరు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించారు. అయితే ఆ 12 మందిని విచారించిన సిట్ అధికారులకు వారిలో కొంతమంది డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఫైల్ తయారు చేశారనే టాక్ బయటికి వచ్చింది. సిట్ అధికారులు ఈ కేసు విషయమై సంచలన నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. డ్రగ్స్ కేసులో పలువురి ప్రముఖుల అరెస్టులు ఉంటాయన్న లీకులు బయటకు వస్తున్నాయి.
మరి ఆ 12 మందే కాకూండా ఇంకొంతమందిని సిట్ అధికారులు విచారణ చేపడతారని టాక్ కూడా వినిపించడమే కాదు.. ఈసారి అరెస్టుల పర్వం మొదలు కాబోతుందని.. ఆ 12 మందిలో కొంతమందిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ లీకులిస్తున్నారు. మరి మరొకసారి ఈ డ్రగ్స్ కేసు మీడియాలో హాట్ టాపిక్ గా మారే అవకాశం ఉందంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో అనేది.