Advertisement
Google Ads BL

ఇలియానా అందుకు కూడా రెడీ అవుతోంది!


సౌత్ సినిమాలను వదిలేసి బాలీవుడ్ కి దగ్గరయిన ఇలియానాకు అక్కడ అనుకున్నంత సక్సెస్ దక్కడం లేదు. ఈ మధ్య కాలంలో సినిమా అవకాశాల కన్నా ఎక్కువగా తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రు విషయంలోనే మీడియాకి హైలెట్ అవుతుంది. సీక్రెట్ మ్యారేజ్ అని.. సహజీవనం అని అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వినబడుతున్నాయి. అయితే ఇలియానా  ఇక్కడ తెలుగు సినిమాలను వదిలి వెళ్ళిపోయి బాలీవుడ్ లో సెటిల్ అయినా అక్కడ కూడా పెద్దగా చెప్పుకోదగ్గ విజయాలు ఏవి లేవు. అయితే ఛాన్స్ ల కోసం ట్రై చేస్తున్న ఇలియానాకు విసుగుపుట్టిందేమో... ఇప్పుడు ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.

Advertisement
CJ Advs

అదేమిటంటే.. ఇలియానా బుల్లితెర మీద కూడా మెరవడానికి రెడీ అవుతుందనే టాక్ బయటికొచ్చింది. వీలుంటే టీవి సీరియల్స్ లో కూడా నేను నటించడానికి రెడీ అంటుంది ఇలియానా. సీరియల్స్ లో కూడా సినిమాల్లో లాగే ఫ్యామిలీ ఎమోషన్స్.... అలాగే అన్ని ఎమోషన్స్ ఉంటాయి అని.... నేను నటిని కాబట్టి నాకు సినిమాలు ఇంకా సీరియల్స్ అంటూ తేడా ఏమి లేదు అని ఇలియానా చెప్పుకొచ్చింది. బిగ్ స్క్రీన్ మీద ఎలాగైతే సక్సెస్ అయ్యానో అదే విధంగా బుల్లి తెర మీద కూడా సక్సెస్ అవుతాను అనే నమ్మకం నాకు ఉంది అని ఇలియానా ధీమా వ్యక్తం చేస్తుంది.

మరి బాలీవుడ్ సినిమా అవకాశాల కోసం ఎదురు చూసి చూసి ఇక ఆ అవకాశాలు రావని ఫిక్స్ అయిందేమో ఇలియానా. అందుకే ఇలియానా ఇలా సీరియల్స్ లో నటిస్తాను అంటూ స్టేట్మెంట్ ఇవ్వడం ఇప్పుడు అందరిని షాక్ కి గురి చేస్తుంది. మరి సినిమాల్లో గ్లామర్ షో చేసిన ఇలియానా ఇప్పుడు సీరియల్స్ లో ఎలా కనబడుతుందో అని అప్పుడే హాట్ హాట్ చర్చలకు శ్రీకారం చుట్టేశారు. ఇక ఇలియానా స్టేట్మెంట్ చూసి సీరియల్స్ నిర్మాతలెంతమంది ఆమె వెనక పడతారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Ileana Ready to Act in Bullithera Serials :

Ileana Ready to Act in Small Screen <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs