Advertisement
Google Ads BL

పాపులారిటీగా చూస్తే వర్మ మాటల్లో అర్ధముంది!


హీరోలు, స్టార్స్‌ తమకెంతో ఫాలోయింగ్‌ ఉందని తెగ ఫీలైపోతుంటారు. కానీ వారికి ఒక్క విషయం మాత్రం అర్ధం కాదు. జ్యోతిలక్ష్మి పాదయాత్ర చేసినా కూడా జగన్‌కి వచ్చిన జనాల కంటే ఎక్కువ మంది వస్తారు. ఇక నేషనల్‌ స్టార్స్‌గా చెప్పుకునే వారి కంటే సన్నిలియోన్‌ వంటి వారికి ఉండే పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మమ్ముట్టి, మోహన్‌లాల్‌ కంటే ఆమెను చూడటానికి తిరువనంతపురంలో జనం పోటెత్తారు. ఇక 'రాయిస్‌' సినిమా సమయంలో షారుఖ్‌ని కూడా పట్టించుకోకుండా సన్ని వెంట పడ్డారు. కాబట్టి జనాలు రావడం, జనాలలో క్రేజ్‌ అనేవి పెద్దగా ప్రాధాన్యం లేని అంశాలేనని చెప్పాలి.

Advertisement
CJ Advs

రజనీకాంత్‌, అమితాబ్‌లకి మించిన ఫాలోయింగ్‌ సన్నిలియోన్‌ వంటి వారికి ఉంది. ఇక ఒకనాడు మలయాళంలో షకీలా చిత్రాలు విడుదలకు సిద్దమవుతున్నాయంటే చాలు పెద్ద పెద్ద స్టార్స్‌ కూడా తమ చిత్రాలను వాయిదా వేసుకునే వారు. ఇక తాజాగా ఇదే అంశాన్ని వర్మ ప్రస్తావించాడు. తన దృష్టిలో పవన్‌కళ్యాణ్‌ కన్నా సన్నిలియోన్‌కే ఎక్కువ గౌరవం ఉందని తేల్చేశాడు. పవన్‌ కేవలం ఓ ప్రాంతీయ సెలబ్రిటీ మాత్రమేనని, కానీ సన్నిలియోన్‌ నేషనల్‌ వైడ్‌ సెలబ్రిటీ. యావత్‌ భారతదేశంలో సన్నిలియోన్‌ మోస్ట్‌ పాపులర్‌ పర్సన్‌. ఈ విషయంలో ఏ విధమైన సందేహం లేదు. ఎవరితో చర్చించాల్సిన పని కూడా లేదు.

పవన్‌ సమాజానికి సేవ చేస్తానని చెబుతున్నట్లే.. సన్నిలియోన్‌ కూడా సమాజం కోసం ఇంకా సేవ చేస్తానని చెప్పింది అంటూ సెటైర్లు విసిరాడు. తాజాగా పవన్‌ పర్యటనకు సంబంధించిన విషయాలను విన్నానని, పవన్‌ బాగా ఆలోచించి మాట్లాడుతాడని, ఆయన మాటల్లో నిజాయితీ కనిపిస్తోందని, ఆయన్ను చూసిన తర్వాత తాను కూడా ఏదైనా మాట మాట్లాడే ముందు, ట్వీట్‌ చేసేముందు దాని గురించి ఆలోచించాలనే విషయాన్ని తెలుసుకున్నానంటూ స్పందించిన వర్మ రెండు రోజుల్లోనే పవన్‌పై మరలా వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. ఇక సన్నిలియోన్‌ అయితే మన దేశానికి వచ్చిన తర్వాతే తాను అంతకు ముందు చేసిన పని ఎంత తప్పో తెలుసుకున్నానని చెప్పి, ఏకంగా ఆ పాపను దత్తత తీసుకుని సమాజసేవ అంటే ఎంటో చేతల్లో చూపించింది.

RGV on comparing Pawan Kalyan to Sunny Leone:

RGV responded on his comparing Pawan Kalyan to Sunny Leone in a tweet in his debate on Kadapa web series controversy in a popular media channel.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs