అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్ నటించిన హలో సినిమా ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలకాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బుధవారం రాత్రి జరిగిన హలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నాగార్జున మిత్రుడు చిరంజీవితో పాటే... అఖిల్ స్నేహితుడు రామ్ చరణ్ లు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. మరి మెగాస్టార్ చిరు, రామ్ చరణ్ లు ఇద్దరూ హలో ప్రమోషన్ లో అఖిల్ ని బాగానే పొగిడేశారు. కేవలం వాళ్లిద్దరూ అఖిల్ ని పొగడడమే కాదు.. అఖిల్ కూడా చిరుని చరణ్ ని ఓవరాల్ గా మెగా అభిమానులను ప్లాట్ చేసేశాడు.
ఈవెంట్ మొదట్లోనే చిరంజీవి, రామ్ చరణ్ లను ఉద్దేశించి అఖిల్ మట్లాడుతూ ఈవెంట్ కి వచ్చిన మా పెదనాన్న చిరంజీవికి.. మా పెద్దన్నయ్య రామ్ చరణ్ కు థ్యాంక్స్ అంటూ అటు మెగా ఫ్యామిలీని, ఇటు మెగా ఫ్యాన్స్ కి కలిపి వల విసిరాడు. మరి సినిమా ప్రపంచంలో మెగా ఫ్యామిలీకి ఉన్నత ఫ్యాన్ ఫాలోయింగ్ మరే ఇతర హీరోలకు లేదు. ఇలా చిరుని, చరణ్ కి కలిపి పొగిడేస్తే... మెగా ఫ్యాన్స్ కూడా కూల్ గా అఖిల్ ని కూడా తమ హీరో కిందే లెక్కేసేస్తారు. కానీ అక్కినేని నాగార్జునకు మెగాస్టార్ చిరుకి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండబట్టే నాగ్ కొడుకు అఖిల్ కోసం ఇలా పిలవగానే చిరంజీవి ఈ ఈవెంట్ కి రావడమే కాదు హలో సినిమాని వీక్షించానని.. సినిమా అదుర్స్ అని పాజిటివ్ సంకేతాలు పంపాడు చిరు.
అయితే అఖిల్ అలా చిరుని పెదనాన్న, చరణ్ ని పెద్దన్నయ్య అంటూ అనడాన్ని నాగార్జున మాత్రం బాగా ఎంజాయ్ చేశాడు అందుకే నాగ్... అఖిల్, రామ్ చరణ్ లు ఇద్దరి మంచి స్నేహితులయ్యారు. వాళ్లిద్దరూ ఎప్పుడు ఫ్రెండ్సయ్యారో.. అలాగే అఖిల్, చరణ్ ని ఏప్పటి నుంచి పెద్దన్నయ్య అని పిలుస్తున్నాడో నాకు తెలియదు.... కానీ అలా పిలవడం చాలా బాగుంది. సో హ్యాపీ అంటూ నాగార్జున తన ఆనందాన్ని బయటపెట్టాడు. మరి మొత్తానికి ఇదంతా మెగా ఫ్యాన్స్ ని తమ వైపు తిప్పుకోవడానికి తండ్రికొడుకులు మంచి ప్లాన్ చేశారంటూ కొందరు కామెంట్స్ చెయ్యడం విశేషం.