Advertisement
Google Ads BL

సినిమా ప్రమోషన్ కోసం లౌక్యం చూపిన హీరో!


కొందరికి మిగిలిన సమయాలలో గుర్తుకురాని విషయాలన్నీ తమ చిత్రాలు విడుదలకు సిద్దమవుతున్నవేళ గుర్తుకు వస్తాయి. ప్రస్తుతం అల్లుఅర్జున్‌కి, పవన్‌కళ్యాన్‌ ఫ్యాన్స్‌కి జరుగుతున్న వార్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బన్నీ మీద ఉన్న కోపాన్ని పవన్‌ అభిమానులు అల్లు శిరీష్‌ మీద కూడా చూపుతునే ఉన్నారు. వారేమీ దీనిని రహస్యంగా ఉంచడం లేదు. పవన్‌ అభిమానులు బన్నీ, శిరీష్‌, అల్లుఅరవింద్‌లపై ఉన్న కోపాన్ని బహిరంగంగానే ప్రదర్శిస్తున్నారు. అయితే ఇప్పటికే తాను స్టార్‌గా నిలబడి, తన ఓన్‌ ఫ్యాన్స్‌ని తాను సాధించుకుని, యావరేజ్‌ చిత్రాలను కూడా బ్లాక్‌బస్టర్స్‌గా నిలుస్తున్నాయని బన్నీ.. పవన్‌ ఫ్యాన్స్‌ని డోంట్‌ కేర్‌ అంటున్నాడు.

Advertisement
CJ Advs

ఇక అల్లుఅరవింద్‌ గారి చిన్నబ్బాయి అల్లు శిరీష్‌ మాత్రం ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. ఎన్నో బేనర్లు, కావాల్సినంత బ్యాగ్రౌండ్‌ ఉన్నా కూడా అల్లుశిరీష్‌ ఖాతాలో 'శ్రీరస్తు..శుభమస్తు' తప్ప యావరేజ్‌ చిత్రం కూడా లేదు. దాంతో ఆయన ప్రస్తుతం 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' దర్శకుడు విఐ ఆనంద్‌ దర్శకత్వంలో 'ఒక్క క్షణం' చేస్తున్నాడు. గీతాఆర్ట్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెలాఖరున విడుదల కానుంది. ఇక్కడే అల్లుఅరవింద్‌, అల్లుశిరీష్‌లు తమ లౌక్యం చూపుతున్నారు. ప్రస్తుతం ప్రేక్షులందరూ 'అజ్ఞాతవాసి'తో పాటు 'ఎంసీఏ, హలో' చిత్రాల విషయంలో బిజీబిజీగా ఉన్నారు. దాంతో ఈ సందడి కాస్త ఊపు తగ్గిన తర్వాతే 'ఒక్కక్షణం' ప్రమోషన్స్‌ మొదలుపెట్టాలని భావిస్తున్నారు. 

ఇక తాజాగా అల్లుశిరీష్‌ తన అన్నయ్యతో పాటు చరణ్‌ అభిమానులను కూడా మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా అటు బన్నీ, ఇటు శిరీష్‌లు ఉండగా, మధ్యలో రామ్‌చరణ్‌ వారిద్దరి భుజాల మీద ఆప్యాయంగా చేతులు వేసిన ఫొటోని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఈ ఫొటో ఏ సందర్భంలోనిది? ఎప్పటిది? అని చెప్పకుండా...బన్నీ, చరణ్‌లతో నేను. వాళ్లిద్దరు నేను కలిసి ఎంతో ప్రేమగా పెరిగాం... అని పేర్కొన్నాడు. మరి 'ఒక్కక్షణం' రిలీజ్‌కి దగ్గరపడిన వేళనే ఈ ఫోటోని పోస్ట్‌ చేయడం వెనుక ఉన్న రహస్యం ఏమిటో శిరీష్‌, బన్నీ, వాళ్ల తండ్రి అల్లుఅరవింద్‌లకు మాత్రమే తెలుసని చెప్పాలి. 

Allu Sirish Posted Ram Charan and Allu Arjun Photo:

Allu Sirish Okka Kshanam Movie Release on Dec 28th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs