Advertisement
Google Ads BL

అనుష్క ఎప్పుడూ ముందే ఉంటుంది: ప్రభాస్!


బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాల‌లో జోడి కట్టిన  ప్రభాస్, అనుష్క ఇద్దరు బ్యూటిఫుల్ ఆన్ స్క్రీన్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. అందుకే ప్రేక్షకులు కూడా నిజ జీవితంలో వీరు బ్యూటీఫుల్ కపుల్ గా మారతారనే గాసిప్ ని బాగా ఎంజాయ్ చేశారు. కానీ మేమిద్దరం మంచి స్నేహితులమే గాని... మామధ్య మరేమి లేదని అటు ప్రభాస్, ఇటు అనుష్కలు ఎప్పుడో క్లారిటీ ఇచ్చేశారు. అయితే ప్రస్తుతం వీరిద్దరూ తమ తమ సినిమాల్తో బిజీగా ఉన్నారు. ఎంత బిజీలో ఉన్నా గాని వారిద్దరి సినిమాల్లో ఏదైనా విషయం బయటికి వస్తే.. ఆ  సినిమా గురించి మరొకరు చెప్పుకుంటూ ఎంకరేజ్ చేసుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే ప్రభాస్, అనుష్క ని ఒక రేంజ్ లో పోగిడేశాడు.

Advertisement
CJ Advs

ఇంతకీ ప్రభాస్, అనుష్కని ఎందుకు పొగిడాడంటే...  అనుష్క నటించిన లేటెస్ట్ మూవీ అయిన భాగమతి టీజర్ తాజాగా రిలీజ్ అయ్యింది. 27 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ భాగమతి మూవీ పై ఆసక్తిని ఇంకాస్త పెంచింది. మరీ ముఖ్యంగా అనుష్క పాత్ర పై ఎక్కడా లేని క్యూరియాసిటీ క్రియేట్ అవుతోంది ఈ టీజర్ వలన. అశోక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భాగమతి టీజర్ అందరిని బాగా ఆకట్టుకుంది. ఇకపోతే ఈ భాగమతి టీజర్ గురించి ప్రభాస్ మాట్లాడుతూ.... 'కొత్తగా ట్రై చేయడంలో స్వీటీ ఎప్పుడూ ముందే ఉంటుంది' అని అనుష్క కి సినిమాపై ఉన్న ప్యాషన్ ని వ్యక్తపరిచాడు.

అలాగే భాగమతి మూవీ మంచి సక్సెస్ అవ్వాలి అని కూడా ప్రభాస్ కోరుకున్నాడు. ఇకపోతే ఈ భాగమతి సినిమాలో తన స్నేహితురాలు అనుష్క నటించడమే కాదు... ఈ సినిమాని  ప్రభాస్ కి సొంత బ్యానర్ లా మారిన యువి క్రియేషన్స్  ప్రొడ్యూస్ చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 26 న ఈ మూవీ రిలీజ్ కానుంది.

Prabhas Praises Anushka and Bhaagamathie Teaser:

Young Rebel Star Prabhas on Anushka Bhagaamathie Teaser
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs