Advertisement
Google Ads BL

పవన్ తో మళ్లీ మళ్లీ చేయాలనివుంది: త్రివిక్రమ్!


ఇప్పటికే పవన్‌కళ్యాణ్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ 'జల్సా, అత్తారింటికి దారేది' చిత్రాలు తీశాడు. ఇప్పుడు 'అజ్ఞాతవాసి'తో రానున్నాడు. తాజాగా 'అజ్ఞాతవాసి' చిత్ర ఆడియో విడుదల జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో త్రివిక్రమ్‌ మాట్లాడుతూ.. పవన్‌తో మరిన్ని చిత్రాలను చేయాలనుందనే కోరికను వెలిబుచ్చాడు. ఈ సినిమా గురించి నన్ను ఏమైనా చెప్పమంటే తనకు 'ఎందరో మహానుబావులు' అనేదే గుర్తుకొస్తోందని అన్నారు. ఈ చిత్రానికి పని చేసిన వారందరూ తమ తమ రంగాలలో నిష్ణాతులని, వారంతా గొప్పగొప్పవారు. ఎవ్వరూ తక్కువ కాదు. ఈ చిత్రానికి పనిచేసిన అందరి నుంచి ఎంతో నేర్చుకున్నాను.. వారందరికీ ధన్యవాదాలు అని తెలిపారు. 

Advertisement
CJ Advs

తాను ఈ చిత్రంలో నటించమని ఖుష్బూ దగ్గరకువెళ్లి కథ చెప్పగానే చేస్తున్నాను పో..అన్నారని, ఇక కీర్తిసురేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌లు ఎంతో క్రమశిక్షణ కలిగిన వారని, వారు ఏనాడు షూటింగ్‌కి ఆలస్యంగా రాలేదని, వారి నుంచి నేను క్రమశిక్షణ నేర్చుకున్నానని తెలిపారు. ఈ యూనిట్‌లోని అందరి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఈ చిత్రంలో పవన్‌ నటనా విశ్వరూపం చూస్తారు అని త్రివిక్రమ్‌ ఎంతో నమ్మకంగా చెప్పారు. 

ఇక తనను ఈ చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నందుకు అనిరుద్‌ సంతోషం వ్యక్తం చేస్తూ 'థాంక్స్‌ పవన్‌గారు, త్రివిక్రమ్‌ గారు. ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు ఎంతో హిట్‌ అయ్యాయి. అంతకంటే పెద్ద గిఫ్ట్‌ ఏముంటుంది?' అని అనగా, అనిరుద్‌ 'కొలవరి' పాటంటే తనకెంతో ఇష్టమని, తాను ఒక్కడినే ఉన్నప్పుడు ఆ పాటను పాడుతూ, స్టెప్స్‌ వేసుకుంటూ ఉంటానని పవన్‌ చెప్పుకొచ్చాడు. 

Trivikram Speech at Agnathavasi Audio Launch:

Trivikram With again work with Pawan Kalyan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs