Advertisement
Google Ads BL

తమన్నా అవుట్.. సమంతకి గోల్డెన్ ఛాన్స్!


సమంత జోరు మాములుగా లేదు. పెళ్ళికి ముందు సినిమాల్లో బిజీగా వున్నా పెళ్లి తర్వాత కూడా అంతే బిజీగా సినిమాలో కొనసాగడమే కాదు.. మాంచి దూకుడు మీదుంది. తెలుగు, తమిళంలో ఏకకాలంలో దున్నేస్తున్న సమంత మరోపక్క వస్త్ర దుకాణాలకు బ్రాండ్ అంబాసిడర్ గా, ఇంకా వివిధ రకాల ప్రోడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తోంది. తన కెరీర్ ని ఎంతో పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్న సమంత అటు నట జీవితంలోను, ఇటు నిజ జీవితంలో లక్కీ అమ్మాయిలా మారింది. అక్కినేని వారింటి కోడలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమంత ఇటు కెరీర్ లోను ఫుల్ హ్యాపీ.

Advertisement
CJ Advs

అలాగే తెలంగాణ చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే సమంతకి సేవా కార్యక్రమాలన్నా చాలా ఆసక్తి. ఇకపోతే ఇప్పుడు కొత్తగా సమంత మరో బడా ఆఫర్ ని చేజిక్కించుకుంది. అదేమిటంటే... జీ తెలుగువారు సమంతని ప్రచార బాధ్యతల కోసం సంప్రదించగా... ఆ డీల్ కి ఓకే చెప్పేసింది సమంత. అయితే ఇప్పటివరకూ ఈ ఛానల్ వారు తరుపున ప్రచారం చేస్తున్న తమన్నా స్థానంలో ఇకపై సమంత రానుంది. జీ ఛానల్ కు సంబంధించిన సీరియల్స్.. సినిమాలకు సంబంధించిన ప్రచారాన్ని సమంత చేయనుంది. ఇందుకు సంబంధించిన ఒప్పందం ఇప్పటికే జరిగిపోయినట్లుగా టాక్.

ఇప్పటికే ఆ ఛానల్ వారు సమంతతో ఆ కార్యక్రమానికి సంబందించిన యాడ్ షూట్ పూర్తి చేశారనే టాక్ కూడా వినబడుతుంది. ఇకపోతే సమంత ఇలా జీ కార్యక్రమాల ప్రచారం కోసం అక్షరాలా 1.5  కోటి అందుకుందనే ప్రచారం కూడా జరుగుతుంది. ఏదైనా సమంత లక్కీనే. 

Tamanna Out and Samantha in For Zee Promo Ad:

Samantha As Zee Brand Ambassador
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs