Advertisement
Google Ads BL

'అజ్ఞాతవాసి' కోసం ఆగలేకపోతున్నా: చరణ్!


పవన్‌కళ్యాణ్‌-త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'అజ్ఞాతవాసి' చిత్రం తెలుగులో నాన్‌ బాహుబలి రికార్డులన్నింటిని తిరగరాస్తుందని పవన్‌ అభిమానులు భావిస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన ఈ టీజర్‌పై మెగా హీరోలు, వారి అభిమానులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'రికార్డులన్ని కృష్ణుడికి దాసోహం' అవుతాయని సాయిధరమ్ తేజ్‌ వ్యాఖ్యానిస్తే.. రామ్‌చరణ్‌ 'ఈ టీజర్‌లో బాబాయ్‌ ప్రతి ఎక్స్‌ప్రెషన్‌ ఎంతో ఫ్రెష్‌గా, అద్భుతంగా ఉన్నాయి. బాబాయ్‌ ఎట్‌ హిజ్‌ బెస్ట్‌. బాబాయ్‌ తన మేనరిజమ్స్‌తో అదరగొట్డాడు. సంక్రాంతి వచ్చే వరకు ఆగలేకపోతున్నాను. ఎంత త్వరగా ఈ చిత్రాన్ని చూస్తానా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను' అని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. 

Advertisement
CJ Advs

ఇక వివాదాస్పద దర్శకుడు వర్మ ఫేస్‌బుక్‌లో స్పందిస్తూ.. 'అజ్ఞాతవాసి టీజర్‌ అద్భుతంగా ఉంది. పవన్‌ అత్యద్భుతంగా కనిపిస్తున్నాడు' అంటూ మెచ్చుకున్నాడు. ఇక ఎందరో ప్రముఖులు, సెలబ్రిటీలు ఈ టీజర్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ని క్రిస్మస్‌ కానుకగా రిలీజ్‌ చేసి, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్‌కు ప్లాన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి అనిరుధ్‌ అందించిన సంగీతం తెలుగు రాష్ట్రాలలోనే కాదు..తమిళనాటే కాక అన్ని ఇండస్ట్రీలలోనూ సంచలనం సృష్టిస్తోంది. ఇక ఖుష్బూ ఓ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో బొమన్ ఇరాని, మురళీశర్మ, ఆది పినిశెట్టి వంటి వారు కీలక పాత్రలను పోషిస్తుండగా కీర్తిసురేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Ram Charan Reaction on Agnathavasi Teaser:

Celebrities Praises Agnathavasi Teaser
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs