Advertisement
Google Ads BL

'భాగమతి' భయపెట్టేస్తుందిగా !!


'బాహుబలి'లో దేవసేనగా అందరి మదిలోనూ నిలిచిపోయిన అనుష్క.... 'అరుంధతి' చిత్రంతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఊపిరి పోసింది. 'అరుంధతి' తర్వాత 'రుద్రమదేవి' వంటి చారిత్రాత్మక చిత్రాల్లో సైతం మెప్పించిన అనుష్క ఇప్పుడు బాహుబలి తరువాత అశోక్ డైరెక్టన్ లో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నటిస్తున్న చిత్రం ‘భాగమతి’. అనుష్క మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ ఈరోజు బుధవారం ఉదయం విడుదలైంది. ఈ చిత్రంలో భాగమతి కేరెక్టర్ లో అనుష్క నటిస్తుంది.

Advertisement
CJ Advs

ఇక టీజర్ లోకి వెళితే.. 'భాగమతి' టీజర్ లో ఒక పాడుబడిన భవంతి.. అనేకంటే అదో మహల్ అనడం కరెక్ట్. ఆ మహల్ లో ఎటు చూసినా భయంకరంగా కనిపించే బూజు పట్టిన వస్తువులు.. భయానకాన్ని సృష్టించే చీకట్లు దానిలో నుండి భాగమతి... అనుష్క నడుచుకుంటూ వచ్చి తనకి తానే శిక్ష వేసుకోవడం కాస్త ఇంట్రెస్టింగ్ ని కలిగించే అంశాలు. కాకపోతే అనుష్క అలా ఎందుకు తనకి తానే శిక్ష వేసుకుంటూ చేతిలో మేకులు దించుకుంటూ సుత్తితో మొదుకుంటూ ఎందుకు రక్తాన్ని చిందిస్తుందో  అర్ధం కాదుగాని.. ఆ దృశ్యం మాత్రం భయపెట్టేస్తుంది.  

మరి టీజర్ తో 'భాగమతి' కథ ఏమిటనేది అస్సలు అర్ధం కాదుగాని.. ఈ కథలో ఎదో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందనేది మాత్రం అర్ధమవుతుంది. ఇక ఈ సినిమాకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ స్పెషలిస్ట్ థమన్ మరోసారి తన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో అదరగొట్టేసాడు. ఇక ఈ సినిమా జనవరి 26 న రిపబ్లిక్ డే కానుకగా విడుదలకు సిద్దమవుతుంది.

Click Here For Bhaagamathie Teaser

Anushka UV Creations Bhaagamathie Movie Teaser:

Anushka in and as Bhaagamathie teaser has just released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs