Advertisement
Google Ads BL

'స్పైడర్'.. దిల్ రాజుని భయపెట్టేసిందా?


మహేష్ బాబు ఎంతో ఇష్టపడి, ఎంతో కష్టపడి ఏ.ఆర్.మురగదాస్ కాంబినేషన్ చేసిన స్పైడర్ ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా భారీ డిసాస్టర్ అయ్యి ఎంతో మంది డిస్ట్రిబ్యూటర్స్ ని నిండా ముంచేసింది. నిర్మాత సినిమా అమ్మేసుకున్నప్పటికీ.... ఈ సినిమా వల్ల భారీ నష్టాల్లో కూరుకుపోయారు వారు. అయితే ఈ స్పైడర్ వల్ల నష్టపోయిన లిస్టులో నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ముందు వరుసలో ఉన్నాడ‌ట. అవును ఈ విషయాన్ని స్వయానా దిల్ రాజు.. ఎంసీఏ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బయటపెట్టాడు.

Advertisement
CJ Advs

స్పైడర్ సినిమా తీసిన దర్శకుడు మురుగదాస్ ని, అలాగే హీరో మహేష్ తో ఉన్న అనుబంధంతో.. అలాగే మురుగదాస్ - మహేష్ కలయిక చూసి భారీ ధరకి ఈ సినిమాని కొన్నానని.... కానీ సినిమా రిజల్ట్ వచ్చాక ఈ స్పైడర్ సినిమా వల్ల భారీగా నష్టపోయింది నేనే అని చెప్పుకొచ్చాడు. ఆ స్పైడర్ సినిమా నన్ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసిందని... అలాగే తాను డిస్ట్రిబ్యూషన్ చేయడానికి రకరకాల కారణాలుంటాయని... కేవలం ప్రాజెక్టు మీద నమ్మకంతోనే కాక సెంటిమెంటుతో అలాగే మొహమాటాలతో కూడా కొన్ని సినిమాలు తీసుకోవాల్సి ఉంటుందని దిల్ రాజు తెలిపాడు.

స్పైడర్ తో కోలుకోలేని దెబ్బతిన్న దిల్ రాజుకి కాస్త భయమేసినట్టుగా వుంది. అందుకే ఇక ఇప్పటి నుంచి పంపిణి రంగంలో బిజినెస్ ని తగ్గించి... నా సొంత సినిమాలనే పంపిణి చేయాలని నిర్ణయించుకున్నాను అని దిల్ రాజు తనేమనుకుంటున్నాడో అనేది స్పైడర్ విడుదలైన చాన్నాళ్లకు బయటపెట్టాడు.

Dil Raju Feared with Spyder Movie :

Dil Raju Goodbye To Distribution Job
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs