Advertisement
Google Ads BL

కేటీఆర్‌ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు!


కేటీఆర్‌ వ్యవహారశైలి ప్రత్యేక తెలంగాణ ఏర్పడకముందే అందరికీ తెలుసు. ఇక ప్రత్యేక తెలంగాణ ఏర్పడి మంత్రి అయిన తర్వాత ప్రతి విషయంలోనూ కేటీఆర్‌ తనదైన ప్రత్యేకను చూపిస్తున్నారు. ఏపీలో లోకేష్‌ మీద వచ్చినట్లుగా కేటీఆర్‌ వ్యవహారశైలి, సమాధానాలు, ఉపన్యాసాలు ఇవ్వడంలో ఆయనపై విమర్శలు రావడం లేదు. లోకేష్‌కి పేర్లు పెట్టే వారు కూడా కేటీఆర్‌ శైలికి మంత్రముగ్దులవుతున్నారు. 

Advertisement
CJ Advs

తాజాగా కేటీఆర్‌కి 'లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డు లభించింది. ఈ సందర్భంగా పలువురు రాజకీయనాయకులతో పాటు సినీ ప్రముఖులు కూడా కేటీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌ ట్వీట్‌ చేస్తూ 'కంగ్రాట్స్‌ కేటీఆర్‌ సార్‌.. మీరు తెలంగాణకి గర్వకారణం' అన్నాడు. 'కేటీఆర్‌ భాయ్‌.. కంగ్రాట్స్‌. అభివృద్ది కోసం మీరు చేస్తోన్న కృషిని చూస్తున్నాం. ముఖ్యంగా స్టార్టప్‌ క్యాంపెయిన్‌ అద్భుతం. యువ పారిశ్రామికవేత్తలకు ఇది ఎంతో తోడ్పాటుని అందిస్తుంది. ఈ అవార్డుకు మీరు పూర్తిగా అర్హులు. మీరు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి..' అని హీరో నిఖిల్‌ ట్వీట్‌ చేశాడు. 

మంచు విష్ణు 'తెలుగువారందరికీ మీరు గర్వకారణం అని ట్వీట్‌ చేయగా, ఇటీవల గాయపడిన మంచు విష్ణుని కేటీఆర్‌ మీ ఆరోగ్యం ఎలా ఉంది' అని ప్రశ్నించారు. సందీప్‌కిషన్‌, వెన్నెలకిషోర్‌, అనిల్‌రావిపూడి, కోనవెంకట్‌, విజయ్ దేవరకొండ, హీరోయిన్స్ తదితరులు కూడా కేటీఆర్‌ని ప్రశంసలలో ముంచెత్తారు. వీరందరికి కేటీఆర్‌ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు...! 

Cine Celebrities Praises KTR:

Leader Of The Year Award Goes to KTR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs