సౌతిండియాలో రజనీకాంత్ తర్వాతి స్థానం తమ హీరోదేనని పవన్ అభిమానులు ఘంటాపధంగా చెబుతూ ఉంటారు. కొన్ని సార్లు పవన్ చిత్రాలకు ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా వచ్చే ఓపెనింగ్స్, టీజర్లు, ట్రైలర్ల వంటివి సోషల్‌మీడియాలో చేసే హంగామా చూస్తే అది నిజమో అనిపిస్తుంది. ఇక పెద్దగా అంచనాలు లేని 'కాటమరాయుడు' టీజర్ సృష్టించిన హంగామా అంతా ఇంతాకాదు. ఇక పవన్ 25వ చిత్రం కావడం, పవన్-త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో 'అజ్ఞాతవాసి' టీజర్ సోషల్ మీడియాలో పెద్ద సంచలనమే సృష్టించింది. టీజర్ విడుదలైన గంటలోపే మిలియన్ వ్యూస్‌ని సాధించింది. ఇక 24 గంటల్లో ఈ టీజర్‌కి 64లక్షల వ్యూస్ వచ్చాయి. అయితే ఈ విషయంలో మాత్రం పవన్ విజయ్ కంటే చాలా వెనుకబడి ఉన్నాడు.
విజయ్ నటించిన 'మెర్సల్' చిత్రం టీజర్ 24 గంటల్లో ఏకంగా కోటి 12లక్షల వ్యూస్‌ని సాధించింది. పవన్ 'అజ్ఞాతవాసి' దానిలో సగం సంఖ్యను మాత్రమే అందుకోవడం గమనార్హం. ఇక పవన్ అజిత్‌నైతే అధిగమించాడు. అజిత్ నటించిన 'వివేగం' చిత్రం 24గంటల్లో 61లక్షల వ్యూస్‌ని మాత్రమే సాధించింది. దీంతో పవన్ అజిత్‌ని క్రాస్ చేసినా కూడా విజయ్‌కి మాత్రం దరిదాపుల్లో లేడు. ఇక లైక్స్ పరంగా మాత్రం 'అజ్ఞాతవాసి' కొత్త రికార్డులనే సాధించింది. ఈ చిత్రం టీజర్ ఒక్కరోజులో 4.12లక్షల లైక్స్‌ని సాధించింది. ఇప్పటివరకు ఇంత పెద్ద మొత్తంలో ఒకే రోజులో లైక్స్ రావడం జరగలేదు.
ఇక 'అజ్ఞాతవాసి' చిత్రాన్ని యూఎస్‌లో కూడా భారీస్థాయిలో 'బాహుబలి'ని మించే రేంజ్‌లో విడుదల చేస్తుండటం, ప్రీమియర్‌షోలకి 25డాలర్లు, మొదటి రోజు టిక్కెట్ ధరను 17డాలర్లుగా నిర్ణయించడం, పవన్-త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌కి ఉండే ఫాలోయింగ్‌ని చూస్తే 'అజ్ఞాతవాసి' చిత్రం తొలి వారంలోనే 100కోట్లు వసూలు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక సాధారణంగా ఆడియోతోపాటు థియేటికల్ ట్రైలర్ ని రిలీజ్ చేయడం కొంతకాలంగా జరుగుతోంది. కానీ 'అజ్ఞాతవాసి' ట్రైలర్‌ని మాత్రం క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నారు.