Advertisement
Google Ads BL

మా మధ్య ఏం లేదంటే నమ్మరే..: హీరోయిన్!


తెలుగమ్మాయి అయినా కూడా మొదటగా తమిళంలో మంచి గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్‌ అంజలి. ఆమె తెలుగులో సీనియర్‌ హీరోల సరసన నటించడమే కాదు.. కాస్త గ్లామర్‌ పాత్రలను కూడా చేసింది. ఐటం సాంగ్స్‌లో నటించింది. ఈమెకి ఇప్పుడు తెలుగుతోపాటు తమిళంలో కూడా మంచి మార్కెట్‌ ఉండటంతో ఆమె ఇక్కడ నటిస్తున్న చిత్రాలు తమిళంలోకి, తమిళంలో ఆమె నటించిన చిత్రాలు తెలుగులో కూడా విడుదలవుతున్నాయి. ఇక ఆమె ప్రస్తుతం ఐదేళ్ల తర్వాత హీరో 'జై'తో కలిసి మరోసారి 'బెలూన్‌' చిత్రంలో నటిస్తోంది. ఇది హర్రర్‌ నేపధ్యంలో సాగే ప్రేమకథా చిత్రం. ఈ చిత్రం అదే టైటిల్‌తో ఈనెల 29న తెలుగులో కూడా విడుదలకు సిద్దమవుతోంది.

Advertisement
CJ Advs

ఇక తనకు తమిళంలో మంచి నటనకు స్కోప్‌ ఉన్న పాత్రలే వస్తున్నాయని, తాను గ్లామర్‌ పాత్రలు చేయనని ఎప్పుడు చెప్పకపోయినా తమిళంలో మంచి పాత్రలు, తెలుగులో గ్లామర్‌ పాత్రలు వస్తుండటం సంతోషంగా ఉందని చెబుతోంది. ఇక ఈ చిత్రం ద్వారా సినీష్‌ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. ఇందులో జననీ అయ్యర్‌ మరో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక 'జై'తో అంజలి సహజీవనం చేస్తోందని, ఆల్‌రెడీ వీరు రహస్యంగా వివాహం కూడా చేసుకున్నారని కోలీవుడ్‌ మీడియా బల్ల గుద్ది చెబుతోంది. కానీ అంజలి మాత్రం తనకు జైకి మధ్య ఏ సంబంధం లేదని, ఆయన తనకున్న మంచి ఫ్రెండ్స్‌లో ఒకరంటోంది.

ప్రస్తుతానికి తనకు వివాహం చేసుకునే ఆలోచన కూడా లేదని, మరికొంత కాలం ఇలాగే ఉంటానని చెబుతోంది. ఇక తాను వివాహం చేసుకోబోయే వ్యక్తి సినిమా ఫీల్డ్‌కి చెందిన వాడా? వేరే వ్యక్తా? అనేది ఇప్పుడే చెప్పలేనని, తన వివాహం విషయంలో ముందుగా మీడియాకు చెప్పే వివాహం చేసుకుంటానని అంటోంది ఈ రాజోల్‌ భామ.

Anjali about links with Jai Rumors:

Anjali Again Clarified about Rumors
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs